షుగర్ వ్యాధికి చెక్ పెట్టాలంటే పుట్టగొడుగులతో ఇలా చేయండి..?

ప్రస్తుత సమాజంలో చిన్న వారి దగ్గర నుంచి పెద్దవారి వరకు షుగర్ వ్యాధి ( Diabetes )సమస్యను చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్నారు.

వయసు పైబడిన వారికే కాకుండా ఊబకాయం ఉన్న వారిలో ఇప్పుడు షుగర్ లెవల్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి.

నిజానికి కొన్ని ఆహార నియమాలను పాటిస్తే షుగర్ పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.వైట్ రైస్ తింటే షుగర్ పెరుగుతుందనేది కొందరి అపోహ.

సాధారణంగా తినే అన్నం మోతాదులో కాస్త తక్కువగా తిని మిగతా రైస్ కి బదులు చపాతీ లేదా పుల్కా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మన ఇంట్లో ఉండే ఆహార పదార్థాలలో కొన్ని ద్వారా షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.వర్షాకాలంలో దొరికే వాటిలో పుట్టగొడుగులు( Mushrooms ) కూడా ఖచ్చితంగా ఉంటాయి.పుట్టగొడుగుల తో షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

వీటిలో పిండి పదార్థాలు( Carbohydrates ) అధికంగా కొవ్వును పెంచ గుణాలు తక్కువగా ఉంటాయి.అంతేకాకుండా ప్రోటీన్, ఫైబర్ ఇతర పోషకాలు అధికంగా కేలరీలు తక్కువగా ఉంటాయి.

నీటి శాతం కూడా తక్కువగా ఉంటుంది.షుగర్ వ్యాధిగ్రస్తులకు ఆకలి ఎక్కువగా ఉంటుంది.

కానీ అన్ని పదార్థాలను తినలేరు.

అలాంటి అప్పుడు పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం ద్వారా కడుపు నిండుగా ఉండి ఎక్కువ ఆహారం తీసుకోలేరు.అలాగే త్వరగా ఆకలి కూడా వేయదు.ఇదే సమయంలో శరీర బరువు తగ్గడంలోనూ పుట్టగొడుగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.పుట్టగొడుగులు జీవక్రియ రుగ్మతలు, గుండెపోటు( heart attack )రక్తపోటు ను కూడా తగ్గించడంలో ఉపయోగపడతాయి.

Advertisement

ఈ సీజన్లో తాజాగా లభించే వీటిని శుభ్రం చేసి కూరగా చేసుకుని అన్నం లేదా చపాతీలు, పుల్కాలు, జొన్న రొట్టెలలో కలిపి తినవచ్చు.వీటిని వారానికి రెండు, మూడు సార్లు పుట్టగొడుగులను ఆహారంలో తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు