పెరుగుతున్న ఎండ‌ల వ‌ల్ల తొందరగా అలసిపోతున్నారా? అయితే ఇలా చేయండి!

మార్చి నెల ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే ఎండలు భారీగా పెరిగిపోయాయి.

గత రెండేళ్ల తో పోలిస్తే ఈ ఏడాది వేసవికాలం కాస్త ముందుగానే ప్రారంభమైనట్టు కనిపిస్తుంది.

ఎండ వేడితో తలెత్తే సమస్యలు అన్ని ఇన్ని కావు.ముఖ్యంగా పెరుగుతున్న ఈ ఎండల దెబ్బకు చాలా మంది తొందరగా అలసిపోతుంటారు.

దీని కారణంగా చేసే పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.ఈ జాబితాలో మీరు చేరకుండా ఉండాలి అంటే తప్పకుండా మీ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే మ్యాజిక‌ల్‌ డ్రింక్ ను చేర్చుకోవాల్సిందే.

ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి కూడా రావు.పైగా ప్రస్తుత వేసవి కాలంలో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను మీకు అందిస్తుంది.

Advertisement
Do This To Avoid Getting Tired From The Sun In Summer! Tiredness, Summer, Pomegr

మరి ఇంతకీ ఆ డ్రింక్‌ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక దానిమ్మ పండును తీసుకుని తొక్క తొలగించి లోపల ఉండే గింజల‌ను సపరేట్ చేసుకోవాలి.

ఈ దానిమ్మ గింజలను కచ్చాపచ్చాగా దంచుకుని పెట్టుకోవాలి.

Do This To Avoid Getting Tired From The Sun In Summer Tiredness, Summer, Pomegr

అలాగే మరోవైపు చిన్న గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండ‌ర్ తీసుకుని అందులో అరకప్పు లేత కొబ్బరి, ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో దంచి పెట్టుకున్న దానిమ్మ గింజలు మరియు నాన‌బెట్టుకున్న‌ సబ్జా గింజలు మిక్స్ చేస్తే మన డ్రింక్ సిద్ధం అవుతుంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

ఈ దానిమ్మ కొబ్బరి డ్రింక్ ప్ర‌స్తుత వేస‌వి కాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Do This To Avoid Getting Tired From The Sun In Summer Tiredness, Summer, Pomegr
Advertisement

రోజులో ఏదో ఒక సమయంలో ఈ డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకుంటే నీరసం, అలసట వంటివి మీ దరిదాపుల్లోకి రావడానికి భయపడతాయి.అలాగే ప్రస్తుత వేస‌వి కాలంలో ఈ డ్రింక్ ను రెగ్యులర్ గా తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.

శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

రోజంతా యాక్టివ్ గా ఉంటారు.రక్తపోటు అదుపులో ఉంటుంది.

మరియు ఎండల ప్రభావం నుంచి చర్మ ఆరోగ్యానికి రక్షణ సైతం లభిస్తుంది.

తాజా వార్తలు