పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అస్సలు ఆలస్యం చేయకండి..

మన శరీరంలో రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ శరీరానికి చాలా హాని తలపెడుతుంది.

అలాగే రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ అడ్డుపడి రక్త ప్రసరణకు ఆటంకం కూడా కలుగుతుంది.

దీని వల్ల గుండెతో పాటు శరీరంలో ఉన్నా మిగతా భాగాలకు కూడా రక్తం సరఫరా చేయడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తుతుంది.దీని వల్ల అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్( Heart attack ), మధుమేహం లాంటి ప్రమాదకరమైన వ్యాధులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందుకే చెడు కొలెస్ట్రాల్ లక్షణాలను సకాలంలో గుర్తించి దానికి కావలసిన చికిత్సను తీసుకోవడం చాలా అవసరం.వాస్తవానికి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు మన పాదాలలో కొన్ని రకాల సంకేతాలు హెచ్చరిస్తాయి.

మరి ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు పాదాలలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయి.అయితే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం చాలా మంచిది.

Advertisement

రక్తంలో చెడు కొలెస్ట్రాల్( Bad Cholesterol ) పరిమాణం పెరిగినప్పుడు పాదాలకు రక్తప్రసరణలో అవరోధం ఏర్పడుతుంది.దీని వల్ల తరచుగా పాదాలు తిమ్మిరి( Leg cramps ) పట్టినట్లు అనిపిస్తోంది.రక్తంలో కొలెస్ట్రాల్ వల్ల ధమనుల్లో అడ్డు ఏర్పడుతుంది.

అలాగే పాదాలలో రక్త సరఫరా కూడా సరిగ్గా జరగదు.దీని వల్ల పాదాలు చల్లగా అయిపోతాయి.

రక్తంలో కొలెస్ట్రాల్ అడ్డుపడటం వలన రక్త ప్రసరణ సరిగా జరగకపోవడంతో పాదాలకు ఆక్సిజన్ సరఫరా కూడా సరిగ్గా చేరదు.

ఇలాంటి పరిస్థితుల్లో పాదాలలో తీవ్రమైన నొప్పి తలెత్తుతుంది.మన పాదాల గోళ్ళ రంగు మారిపోతుంది.సాధారణంగా మన గోళ్ళు గులాబీ రంగులో ఉంటాయి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

కానీ అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వలన గోర్లు పసుపు రంగులోకి మారుతాయి.అలాగే గోర్లలో చారలు కనిపిస్తాయి.

Advertisement

ఇలా ఈ లక్షణాలన్నీ మీకు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

తాజా వార్తలు