పాములు పగబట్టడం గురించి నిపుణులు.. చెప్పిన అసలు నిజం ఇదే..!

మన భారత దేశంలో దాదాపు చాలామంది ప్రజలు పాములను నాగదేవతగా పూజిస్తూ ఉంటారు.ఇంకా కొంత మంది ప్రజలు పాములు కనిపిస్తే వాటిని చంపేస్తూ ఉంటారు.

లేదంటే భయంతో పరిగెడుతూ ఉంటారు.చాలా రకాల పాములు పగ పడుతాయని పెద్దవారు చెబుతూ ఉంటారు.

పాములు ఒక్కసారి పగ పడితే చంపే దాకా వదలవు అని కూడా చెబుతూ ఉంటారు.అంతేకాకుండా చాలామంది ప్రజలను పగబట్టి చంపేసాయి అని కూడా అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం.

పాములు పగబడితే కలలో కూడా అవే వస్తాయని కొందరు పండితులు చెబుతున్నారు.

Advertisement

అసలు పాములు ( Snakes ) నిజంగా పగబడతాయా? మనుషుల లాగా కోపం, పగ, ద్వేషం పాములకు ఉంటాయా లాంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే నాగ పంచమి,( Naga Panchami ) నాగుల చవితి( Nagula Chavithi ) వంటి ప్రత్యేక రోజులలో పుట్టలో పాలు పోసి పూజలు చేస్తూ ఉపవాసాలు కూడా పాటిస్తూ ఉంటారు.పాములు అసలు పాలు తాగుతాయా.

ముఖ్యంగా చెప్పాలంటే పాములు పాలకు సంబంధించిన ఉత్పత్తులను జీర్ణం చేసుకోలేవు.పాములకు బాగా దాహం వేసిన సమయంలో ఏమీ అందుబాటులో లేనప్పుడు మాత్రమే పాలను సేవిస్తాయి.

పాములు తమ ఆహారాన్ని తినడంలో మూడు పద్ధతులను పాటిస్తాయి.

విషపూరితమైన పాములు( Poisonous Snakes ) తమ విషన్ని కాటు వేయడం ద్వారా దానిలోని ఇంజక్ట్ చేస్తాయి.కొన్ని పాములు వాటి ఆహారాన్ని చుట్టి ఊపిరాడకుండా చేస్తాయి.అలాగే మరికొన్ని పాములు చిన్న పాములను తింటూ ఉంటాయి.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పసుపును అస్సలు తినకూడదు.. తింటే మాత్రం..!

కొంతమంది పాముల తలపై వజ్రాలు ఉంటాయి అని చెబుతూ ఉంటారు.వాటి తలపై బరువు మోయడం అసాధ్యం.

Advertisement

ఇంకా చెప్పాలంటే పాములు పగబడతాయని సినిమాలలో, సీరియల్స్ లలో మనకు చూపిస్తూ ఉంటారు.మనం కూడా నిజమే అని నమ్ముతూ ఉంటాము.

వాస్తవానికి పాములకు మనుషులను గుర్తుపెట్టుకోవడానికి అవసరమైన జ్ఞాపక శక్తి లేదు.పాములు పగబడతాయి అనే అపోహను చాలా మంది ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

తాజా వార్తలు