వైఎస్సార్ టీపీని ఇత‌ర పార్టీలు గుర్తిస్తున్నాయా.. ష‌ర్మిల వ్యాఖ్య‌ల వెన‌క మ‌త‌లబు ఎంటీ..?

తెలంగాణ‌లో ష‌ర్మిల‌ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పెట్ట‌డంపై ఇప్ప‌టికీ కొంద‌రికి అర్థం కాని ప్ర‌శ్న‌ .

ఆ పార్టీకి ఎంత‌వ‌ర‌కు ఆద‌ర‌ణ ఉన్న‌ద‌నేది కూడా ఆలోచించాల్సిన విష‌య‌మే.

అయితే రాజ‌న్న బిడ్డ‌గా తెలంగాణ‌లో గ‌ట్టెక్కాల‌నుకుంటున్న ష‌ర్మిల‌ను ప్ర‌జ‌లు ఎంత‌వ‌ర‌కు విశ్వ‌సిస్తార‌నేది కూడా ప్ర‌స్తుతానికి ప్ర‌శ్నార్థ‌క‌మే.పార్టీ అవిర్బావం త‌ర్వాత చాలా మంది చోటా మోటా నాయకుల పార్టీలో చేరారు.

మ‌రికొంత మంది బ‌డా నాయ‌కులు చేర‌తార‌ని కూడా పుకార్లు వినిపించాయి.పార్టీ బ‌లోపేతానికి జిల్లాల వారీగా ఇన్ చార్జుల‌ను నియ‌మించారు.

కార్య‌క‌ర్త‌ల‌కు ప‌లు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.కాగా పార్టీ అధినేత ష‌ర్మిల విసృతంగా పాద‌యాత్ర‌లు చేప‌డుతోంది.

Advertisement

తెలంగాణ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వ‌డానికి ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది.రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగ ఆత్మ‌హ‌త్య‌ల‌పై జోరుగా ప్ర‌సంగిస్తోంది.

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాను ఎండ‌గ‌డుతోంది.పాద‌యాత్ర‌లో భాగంగా అంద‌రినీ క‌లుస్తున్న నేప‌థ్యంలో ప‌లు చోట్ల అడ్డగింత‌లు కూడా ఎదుర్కొన్నారు.

అయితే ఇప్ప‌టికే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌, ఇత‌ర‌ పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు.అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని అధికారం చేపడతామని కూడా ధీమా వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది.ష‌ర్మిల ఈ వ్యాఖ్య‌లు ఎందుకు చేసిన‌ట్లు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

ఏ పార్టీ అయినా త‌మ‌తో క‌లిసి పోటీ చేయ‌మ‌ని ష‌ర్మిల‌ను సంప్ర‌దించిందా.అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

Advertisement

అయితే ష‌ర్మిల టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఓట్లు చీలుస్తామ‌ని చెప్ప‌డం విశేషం.అయితే ఇందులో కూడా కొంత వాస్త‌వం లేక‌పోలేదు ఎందుకంటే.

ఎన్నిక‌ల్లో ఏ పార్టీ పోటీ చేసినా ఎన్నో కొన్ని ఓట్లు రావ‌డం స‌హ‌జం.అయితే విష‌యం ఏమిటంటే ఇత‌ర ప్ర‌ధాన పార్టీలు ష‌ర్మిల పార్టీని లైట్ తీసుకుంటున్నాయి.

త‌మ‌కు పోటీ ఉంటుంద‌ని అనుకోవ‌డంలేదు.పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

అయితే తన ఉనికిని చాటుకోవటం కోసమే షర్మిల పాదయాత్రలని, ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాల పరామర్శలని నిరాహార దీక్షలని చేస్తూ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.అయితే పార్టీ పెట్ట‌బోతుంద‌న్న టైంలో ఉన్న క్రేజ్ ఇప్పుడు క‌నిపించ‌డం లేదు.అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయింది రాజ‌న్న బిడ్డ పార్టీ గురించి.

కానీ ప్ర‌స్తుతం అంత ఊపు క‌నిపించ‌డంలేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

తాజా వార్తలు