Bedroom Vastu : మంచం కింద ఈ వస్తువులను పెడుతున్నారా..? అయితే ఎంత ప్రమాదమో..?

బెడ్ రూమ్ కు( Bedroom ) ఇంట్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.ఏ వ్యక్తి అయినా బెడ్రూమ్లోనే రిలాక్స్ అవుతారు.

కాబట్టి ఎవరి ఇష్టం ప్రకారం వారు బెడ్ రూమ్ ని అలంకరించుకుంటూ ఉంటారు.బెడ్ రూమ్ లో అన్ని తమకు ఇష్టమైన వస్తువులనే చాలామంది పెడుతూ ఉంటారు.

వాటిని చూసుకుంటూ హాయిగా నిద్రపోతారు.అయితే వాస్తు ప్రకారం( Bedroom Vastu ) మాత్రం బెడ్ రూమ్ లో కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు.

వీటి వలన దుష్ప్రభావాలు వస్తాయి.బెడ్ కింద ఖాళీ స్థలాన్ని ఎప్పుడూ నీటిగా ఉంచుకోవాలి.

Advertisement
Do Not Put These Items Under The Bed-Bedroom Vastu : మంచం కింద

అస్సలు చిందరవందరంగా ఉంచుకోకూడదు.అయితే ముఖ్యంగా బెడ్ కింద పాత బట్టలు, పనికిరాని వస్తువులు ఉంచకూడదు.

దీని వలన మీ నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది.

Do Not Put These Items Under The Bed

అంతేకాకుండా భార్య భర్తల మధ్య వివాదాలు కూడా పెరుగుతాయి.ఇక చాలామంది బెడ్ కింద ఎలక్ట్రానిక్ వస్తువులను( Electronics ) పెడుతుంటారు.ఇలా చేయడం వలన టెన్షన్ పెరుగుతుంది.

అలాగే దంపతుల మధ్య తగాదాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.అంతేకాకుండా నెగటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది.

మధుమేహం ఉన్నవారు నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా?

ఇక చాలామంది మంచం కింద కొత్త చెప్పులు, షూస్( Shoes ) లాంటివి కూడా ఉంచుతూ ఉంటారు.ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది.

Advertisement

ఇలా బెడ్ కింద చెప్పులు, షూస్ ఉంచడం వలన చిరాకు, దుష్ప్రభావాలు ఎదురవుతాయి.

అదే విధంగా బెడ్ కింద చీపుర్లు( Broom ) కూడా ఎప్పుడు ఉంచకూడదు.ఇక విరిగిన లేదా దెబ్బతిన్న వస్తువులు కూడా మంచం కింద పెట్టడం వల్ల అస్సలు మంచిది కాదు.ఇలా పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది.

ఇక ఏదైనా ప్రతికూల సంకేతాలు ఉన్న వస్తువులు కూడా మీరు నిద్రించే బెడ్ కింద ఉంచకూడదు.ఇది అస్సలు మంచిది కాదు.

దీని వలన మీ ప్రశాంతత కోల్పోతుంది.విరిగిన ఫోటోలు, అలంకార వస్తువులు కూడా బెడ్ కింద అస్సలు పెట్టకూడదు.ఇలా పెట్టడం వలన జీవితంలో కష్టాలు ఎదురవుతాయి.

అలాగే దాంపత్యంలో కూడా వివాదాలు చోటు చేసుకుంటాయి.

తాజా వార్తలు