అధికారం కోసం వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్న చాలామంది రాజకీయ నాయకుల కు కర్ణాటక కాంగ్రెస్ అద్యక్షుడు డీకే శివకుమార్( D.K.
Shivakumar ) ఉదంతం ఒక నేర్చుకోవలసిన పాఠంగా మిగిలిపోతుంది.ఈరోజు తన ప్రవర్తన తో డీకే విధేయతకు నిర్వచనాన్ని చెప్పినట్టు అయింది.
తన కష్టం మీద పార్టీ గెలిచిందని స్పష్టంగా తెలిసినా కూడా తనకు అధిష్టానమే సుప్రీంకోర్టు లాంటిదని తేల్చి చెప్పిన వైనం సమకాలీన రాజకీయ నాయకులలో తాను అరుదైన రకాన్ని అని ఆయన నిరూపించుకున్నట్లయ్యింది.
2019లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న కర్ణాటక కాంగ్రెస్( Congress ) లో సమర్థవంతమైన నాయకత్వం అవసరమైన భావించిన కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్ కి బాద్యతలు అప్పచెప్పింది .అప్పటినుంచి పార్టీలో ఉన్న లోటుపాట్లు సరి చేస్తూ కార్యకర్తలకు ధైర్యం చెబుతూ, గెలుపుకి వ్యూహాలు రచిస్తూ ఈరోజు 135 స్థానాలకు కాంగ్రెస్ చేరింది అంటే అది డీకే శివకుమార్ చలువే అని చెప్పక తప్పదు.సిద్ధ రామయ్య పరిపాలన ధ్యక్షుడుగా నిరూపించుకున్నప్పటికీ, కార్యకర్తలను కాపాడుకోవడంలోనూ ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టడంలోనూ ఆయనకంత నైపుణ్యం లేదు అని చెప్తారు.
కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా సహాయం అవసరమైనప్పుడల్లా అనేక ప్రభుత్వాలను కాపాడటంలో శివకుమార్ తనదైన ప్రతిభ చూపించారు .విలాస్ రావ్ దేశముక్ ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో కానీ ,2017లో అహ్మద్ పటేల్( Ahmed Patel ) విజయానికి దన్నుగా నిలబడడం లో గాని గత ఎన్నికల్లో జేడీఎస్( JDS ) తో కలిపి అధికారం నిలబెట్టుకోవడంలో కానీ ఆయన చూపించిన అసమాన్య ప్రతిభ పాటవాలే కాంగ్రెస్ ను గట్టెక్కించాయని చెప్పాలి .మరి అంత సమర్ధత కలిగిన నేత కూడా అధిష్టానం ఆదేశాలను శిరసా వహించిన వైనం చూసినప్పుడు రాజకీయాల్లో అత్యంత అరుదైన క్వాలిటీ విధేయత అని, అసలైన రాజకీయ నాయకుడు అంటే తనలా ఉండాలని ఆయన తేల్చి చెప్పేశారు కోర్టులో ఎన్ని వాదనలు అయినా చేస్తాం కానీ కోర్టు తీర్పే ఫైనల్ నాకు అధిష్టానమే కోర్టు అని తేల్చిసీన డీకే తాను అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్త అని నిరూపించుకున్నారు.మరిఇంతటి విదేయత చూపించిన డీకే కు కాంగ్రెస్ ఎలాంటి ప్రతిఫలం ఇస్తుందో భవిష్యత్తు కాలం నిరూపిస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy