ఆ సూపర్ హిట్ రీమేక్ లో డిజే సిద్ధు..!

అంతకుముందు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ కొన్ని సినిమాల్లో సెకండ్ విలన్ గా కూడా నటించి మెప్పించాడు.

డీజే టిల్లు సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సిద్ధు ఇప్పుడు డీజే టిల్లు 2 తో మరోసారి ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటుగా మరో రీమేక్ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.మళయాళంలో ఈమధ్యనే రిలీజై సూపర్ హిట్ అంద్దుకున్న తల్లుమలా సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారట.

DJ Tillu Alias Siddhu Jonnalagadda Green Signal For A Remake Movie , Dj Tillu ,

ఈ రీమేక్ లో టిల్లు అదేనండి మన సిద్ధు జొన్నలగడ్డని హీరోగా ఫిక్స్ చేశారట.ఎంటర్టైనిన్ గా సాగే ఈ సినిమా సిద్ధుకి పర్ఫెక్ట్ రీమేక్ అని చెప్పొచ్చు.

ఖాలిద్ రెహమాన్ డైరక్షన్ లో తెరకెక్కిన తల్లుమలా సినిమా ఆగష్టు 12న రిలీజై సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా తెలుగు రీమేక్ కూడా వర్క్ అవుట్ అవుతుందని తెలిసి వెంటనే మేకర్స్ ఆ సినిమా రైట్స్ కొనేశారు.

Advertisement

తల్లుమలా సినిమాలో హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ నటించింది.మరి తెలుగులో డీజే టిల్లుకి జోడీగా ఎవరు నటిస్తారో చూడాలి.

 డీజే టిల్లు 2 పూర్తి కాగానే ఈ రీమేక్ ని చేయనున్నాడు సిద్ధు.

Advertisement

తాజా వార్తలు