పినపాక ఎమ్మెల్యే రెగా కాంతారావు ( Rega Kantha Rao )ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా మళ్ళీ మూడవ సారి కేసీఆర్ గెలుస్తారని అనడంతో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య అడ్డుకున్నారు.ఒకేసారి కెసిఆర్ ప్రభుత్వానికి భజన చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదాం వీరయ్య( VEERAIAH ) అడ్డుకున్నారు.
ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా మీద మీదకు వెళ్లారు.నువ్వెంత అంటే నువ్వు ఎంత అని ఒకరినొకరు దూషించుకున్నారు.
సుమారు 15 నిమిషాల పాటు ఇద్దరు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఎమ్మెల్యే లతో పాటు ఇరువర్గాల కార్యకర్తలు కూడా ఒకరిపై ఒకరు వివాదాస్పద వాక్యలు చేసుకున్నారుచివరకు జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్, జిల్లా కలెక్టర్ ఇరువర్గాల మధ్య వివాదాన్ని అదుపు చేసి సమన్వయపరిచారు.
ఈ వివాదం అంతా వేదిక మీదనే అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎదుట జరగటం గమనార్హం.