లవ్ ఆంథాలజీ కథలు మొదలు పెట్టిన సుకుమార్

ఇప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా కొనసాగుతుంది.థియేటర్లు బంద్ కావడంతో ఓటీటీ చానల్స్ కి డిమాండ్ బాగా పెరిగింది.

దీంతో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని కూడా తప్పని సరి పరిస్థితిలో ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.మరో వైపు దర్శకులు అందరూ వెబ్ సిరీస్ లతో ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు.

Director Sukumar Love Anthology Web Series, Tollywood, OTT Platforms, Digital En

కొంత మంది వాళ్ళే కొత్త కథలతో వెబ్ సిరీస్ లు మొదలు పెడితే మరికొంత మంది వెబ్ సిరీస్ కథలు సిద్ధం చేసి వేరొక దర్శకులతో వాటిని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ దర్శకులు ఇప్పుడు వెబ్ సిరీస్ ల కోసం కథలు రెడీ చేసి వారి శిష్యులని దర్శకులుగా మారుస్తున్నారు.

ఈ కోవలోకి సుకుమార్ కూడా వచ్చాడు.ఇప్పటికే సొంత ప్రొడక్షన్ హౌస్ ద్వారా తన కథలతో శిష్యులని దర్శకులుగా పరిచయం చేస్తున్న సుకుమార్ ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ కోసం లవ్ ఆంథాలజీ కథలు సిద్ధం చేశాడు.

Advertisement

తొమ్మిది ఎపిసోడ్స్ కోసం తొమ్మిది డిఫరెంట్ ప్రేమ కథలు సిద్ధం చేశాడు.లాక్ డౌన్ లో ఈ ఆంథాలజీ కథలు రెడీ చేసి ఆహా కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సుకుమార్ లవ్ స్టోరీస్ త్వరలో సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి.ఇందులో తొమ్మిది ఎపిసోడ్స్ ని తొమ్మిది మంది దర్శకులతో తెరకెక్కించాలని సుకుమార్ భావిస్తున్నారు.

రెండు ఎపిసోడ్స్ కోసం తన శిష్యులైన సూర్య ప్రతాప్ పల్నాటి, బుచ్చిబాబు సానాలని ఫైనల్ చేశారు.మిగిలిన ఎపిసోడ్స్ కోసం దర్శకులని వెతికే పనిలో పడ్డారు.

వీటిలో ఒక ఎపిసోడ్ తాను కూడా డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.మరి ఈ ఆంథాలజీ లవ్ స్టోరీస్ తో వెబ్ సిరీస్ చేస్తున్న సుకుమార్ కి డిజిటల్ ఓటీటీలో ఎంత వరకు సక్సెస్ వస్తుంది అనేది చూడాలి.

13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?
Advertisement

తాజా వార్తలు