రామ్ చరణ్ దగ్గర అలాంటి పవర్ ఉంది.. శంకర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తమిళ డైరెక్టర్ శంకర్( Tamil director Shankar ) తాజాగా దర్శకత్వం వహించిన సినిమా భారతీయుడు 2( Indian 2 ).

ఇందులో కమలహాసన్ కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.

భార్య సత్యనారాయణ కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జూలై 12 న విడుదల కానుంది.అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది.

ఇక అందులో భాగంగానే తాజాగా తెలుగులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

డైరెక్టర్ శంకర్ ఈ ఈవెంట్ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.

Advertisement

మాకు సపోర్ట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకుల కోసం స్ట్రెయిట్ పిక్చర్ చేయాలని అనిపించింది.రామ్ చరణ్ ( Ram Charan )నటిస్తున్న గేమ్ చేంజర్( Game changer ) ద్వారా ఆ అవకాశం దొరికింది.రామ్ చరణ్ పోర్షన్ కంప్లీట్ అయ్యింది ఆయన గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన దగ్గర ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది.

ఇది ఎప్పుడు బ్లాస్ట్ అవుతదా అనే మంచి యాక్టర్.సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది.రామ్ చరణ్ తో వర్క్ చేసినందుకు చాలా సంతోషం గా ఉంది.

ఇంకా 10 నుంచి 15 రోజుల షూటింగ్ మిగిలి ఉంది.

తర్వాత రిలీజ్ కి రెడీ చేస్తాం అని చెప్పుకొచ్చారు శంకర్.ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా రామ్ చరణ్ విషయానికి వస్తే.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?

చెర్రీ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.చివరిగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

Advertisement

ఈ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు గ్లోబల్ స్టార్ గా మారిపోయారు రామ్ చరణ్.

తాజా వార్తలు