కరోనా పై షార్ట్ ఫిల్మ్ తీసి పంపిస్తే రూ.10000 రివార్డ్ ఇస్తానంటున్న ఆర్జీవి...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ అలాగే సమాజంలోని నిజజీవిత యధార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ వివాదాస్పద దర్శకుడు "రామ్ గోపాల్ వర్మ" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ముక్కు సూటిగా మాట్లాడటం మరియు ఎవరు ఏమనుకున్నా సరే తన మనసులో ఏముందో ముక్కుసూటిగా మాట్లాడటం గురించి ప్రేక్షకులకి తెలిసిందే.

అయితే కరోనా విపత్కర సమయంలో కొంతమంది దర్శకనిర్మాతలు సినిమా షూటింగులు నిలిపివేసినప్పటికీ రామ్ గోపాల్ వర్మ  మాత్రం లాక్ డౌన్ సమయంలో కూడా పలు చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశాడు.అయితే తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ కోవిడ్ పరిస్థితులను మెయిన్ థీమ్ గా తీసుకుని రెండు నిమిషాల పాటు షార్ట్ ఫిలిమ్స్ ని తీసి స్పార్క్ ఓటిటి కి పంపించాలని కోరాడు.

ఇలా చేయడం వల్ల స్పార్క్ ఓటిటీలో ప్రసారం చేయడానికి ఎంపిక చేసిన షార్ట్ ఫిలిమ్స్ కి పది వేల రూపాయలు నగదు బహుమతి కూడా ఇవ్వబడుతుందని తెలిపాడు.అంతేగాక అత్యధికంగా వ్యూస్ వచ్చిన మొదటి ఐదు వీడియోలకు ఒక లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ నగదు బహుమతి ఇవ్వడంతో పాటు స్పార్క్ ఓటిటితో కలిసి చిత్రాలను తెరకెక్కించే అవకాశం కూడా దక్కుతుందని తెలిపాడు.

అయితే ఈ షార్ట్ ఫిలిమ్స్ 30 సెకన్ల నుంచి 2 నిమిషాల మధ్య నిడివి ఉండాలని అంతకు మించి ఉంటే రెజెక్ట్ చేయబడుతుందని కూడా తెలిపాడు.అలాగే తమ వీడియోలను పంపించే సమయంలో ఫోన్ నెంబర్ తో పాటు బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా పంపించాలని సూచించాడు.

Advertisement
Director Ram Gopal Varma Announced Price Money For Covid Main Theme Short Films,

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే రామ్ గోపాల్ వర్మ "డి కంపెనీ" అనే వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించాడు.

Director Ram Gopal Varma Announced Price Money For Covid Main Theme Short Films,

ఈ వెబ్ సిరీస్ ను కూడా స్పార్క్ ఓటిటిలో విడుదల చేశాడు.కాగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ   తెలుగులో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.కాగా ఈ మధ్య కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు