ప్రముఖ పైరసీ సైట్లలో ఒకటైన ఐబొమ్మ ( iBOMMA ) గురించి తెలియని వాళ్లు దాదాపుగా ఉండరు.ఐ బొమ్మలో సినిమాలు చూడటం తప్పని తెలిసినా కొంతమంది ఆ అలవాటును మార్చుకోలేరనే సంగతి తెలిసిందే.
అయితే ఐబొమ్మ గతంలో వార్నింగ్ ఇస్తూ చేస్తూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.హీరోల రెమ్యునరేషన్స్ గురించి, బడ్జెట్స్ గురించి ప్రస్తావిస్తూ ఐబొమ్మ ఆ వార్నింగ్ ఇచ్చింది.
ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఈటీవీ విన్ లో రాజేంద్ర ప్రసాద్,( Rajendra Prasad ) గౌతమి( Goutami ) జంటగా రాజ్ మదిరాజు డైరెక్షన్ లో తెరకెక్కిన #కృష్ణారామా( #KrishnaRama ) స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సినిమాను ఐబొమ్మ తన సైట్ లో పెట్టుకోవడం గురించి ఈ డైరెక్టర్ ఫైర్ అయ్యారు.
అయ్యా ఐబొమ్మా.మా సినిమాలో పెద్ద హీరోలు లేరని పారితోషికాలు తీసుకున్న ఇద్దరు తారలు మధ్యతరగతి వాళ్లేనని రోజుకూలీకి పని చేసేవాళ్లేనని అన్నారు.

చాలా మల్టీ నేషనల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్స్ తో పోల్చి చూస్తే వీళ్ల సంపాదన తక్కువేనని వాళ్ల సంపాదన సరిపోను ట్యాక్స్ లు కడతారని ఆయన చెప్పుకొచ్చారు.మాది ఒరిజినల్ కథ( Original Story ) అని కాపీ కొట్టిన కథ కాదని హైదరాబాద్ లో ఈ సినిమా షూట్ చేశామని థియేటర్లలో సినిమాను రిలీజ్ కూడా చేయలేదని రాజ్ మదిరాజ్( Director Raj Madiraju ) అన్నారు.100 రూపాయలు కడితే కుటుంబం అంతా సినిమా చూసే అవకాశం ఇచ్చామని ఆయన తెలిపారు.

మా సినిమాను మీ సైట్ లో ఎందుకు పెట్టారని మీ పేజీలో కనిపిస్తున్న సినిమాలలో సగానికి పైగా చిన్నాచితకా సినిమాలేనని రాజ్ మదిరాజ్ అన్నారు.నీతికోసం, పేదవాళ్ల కోసం నిలబడుతున్నట్టు ఫోజులు కొట్టే మీకు ఎందుకింత హిపోక్రసీ అని ఆయన తెలిపారు.ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తే పెయిన్ తెలుస్తుందని ఆయన కామెంట్లు చేశారు.







