వకీల్ సాబ్ చూసి గోపిచంద్ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్న మారుతి

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ప్రస్తుతం గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ అనే మూవీ చేస్తున్నాడు.ఇందులో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

డబ్బు కోసం ఎలాంటి కేసుని అయినా వాదించే అవినీతి లాయర్ గా అతని పాత్ర నెగిటివ్ టచ్ లో ఉంటుందని తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.

Director Maruthi Changes In Pakka Commercial Movie Script, Vakeel Saab, Pawan Ka

రాశిఖన్నా ఈ సినిమాలో మరో డిఫరెంట్ ఫన్ రోల్ లో కనిపించబోతుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఇందులో కూడా మారుతి మెయిన్ ఎలిమెంట్ గా విమెన్ ఇష్యూని టచ్ చేసినట్లు సమాచారం పక్కా కమర్షియల్ గా ఉంటూ అవినీతి కేసులు వాదించే లాయర్ అమ్మాయిల ఇష్యూలో రియలైజ్ ఎలా వారికి న్యాయం చేసారనే ఎలిమెంట్ తో ఈ సినిమా ఉండబోతుందనే టాక్ నడుస్తుంది.

అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మెయిన్ ఎలిమెంట్ తో పాటు చాలా సీక్వెన్స్ పక్కా కమర్షియల్ మూవీకి దగ్గరగా ఉండటంతో ఇప్పుడు మారుతి మళ్ళీ తన సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Advertisement

మెయిన్ ఎలిమెంట్ అలాగే ఉంచిన నేరేషన్ మాత్రం కంప్లీట్ గా మార్చే పనిలో పడ్డాడని తెలుస్తుంది.వకీల్ సాబ్ సబ్జెక్టు సీరియస్ గా వెళ్తుంది.

అయితే తన పక్కా కమర్షియల్ మూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో నడుస్తూ లాస్ట్ లో సీరియస్ ఎలిమెంట్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆడియన్స్ కి కొత్తగా అనిపిస్తుందని మారుతి భావిస్తున్నట్లు బోగట్టా.అయితే నేరేషన్ లో మాత్రం కొన్ని సన్నివేశాలు చేంజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు