టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ చరణ్ ( Ram Charan )గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే ఊపుతో తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం.
ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే.
మామూలుగా హీరో రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్గా నటించాలి అని చాలామంది హీరోయిన్లు కోరుకుంటూ ఉంటారు.
అలాంటి అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.అందులోనూ గత ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు చరణ్.
దీంతో చెర్రీ క్రేజ్ మరింత పెరిగింది.అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే.
ఆ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించారు.ఈ సినిమాను డిసెంబర్ నుంచి మొదలు పెట్టాలని ముందుగా అనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇంకా ఆలస్యం ఎలా ఉంది.
ఇక బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టినట్లు కూడా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మొదట ఇందులో జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )ని హీరోయిన్గా తీసుకోవాలని మూవీ మేకర్స్ భావించినట్లు వార్తలు కూడా వినిపించాయి.కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మరో హీరోయిన్ ని సంప్రదించినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు.
చరణ్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ రావాలంటే ఒక కండీషన్‌కు ఓకే చెప్పాలన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆ కండిషన్ ఏమిటంటే.
చరణ్ సినిమా చేస్తున్న సమయంలో ఇతర సినిమాలు చేయకూడదు.ఒక్కముక్కలో చెప్పాలంటే చరణ్ సినిమా అయ్యేంత వరకు బల్క్ డేట్స్ కావాలి.ఎప్పుడు షూటింగ్‌కు రమ్మంటే అప్పుడు రావాల్సిందే.ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత ఆరేడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు బుచ్చిబాబు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చ్ 2024 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి సమ్మర్ 2025కి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు.దానికోసం చరణ్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు.శంకర్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి పూర్తిగా డేట్స్ అన్నీ బుచ్చిబాబుకే ఇవ్వాలని చూస్తున్నాడు.ఒకవేళ ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లు వర్కవుట్ అయితే కచ్చితంగా ఆర్నెళ్ల గ్యాప్‌లోనే చరణ్ రెండు సినిమాలతో రావడం ఖాయం.
అందుకే బల్క్ డేట్స్ ఇచ్చే హీరోయిన్ కోసమే చూస్తున్నారు దర్శక నిర్మాతలు.మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు అందుకుంటారో చూడాలి మరి.







