ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దినేశ్ అరోరా అరెస్ట్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా వ్యాపారవేత్త దినేశ్ అరోరాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా మద్యం కుంభకోణం సీబీఐ కేసులో దినేశ్ అరోరా ఇప్పటికే అఫ్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఐదు ఛార్జ్ షీట్లను దాఖలు చేశారు.

దినేశ్ అరోరా ద్వారానే సౌత్ గ్రూపు నుంచి మనీశ్ సిసోడియాకు ముడుపులు అందాయని అభయోగాలు మోపింది.తాజాగా దినేశ్ అరోరా అరెస్ట్ తో సిసోడియాకు ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు