రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు సార్లు వాయిదా పడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని మార్చి 18 లేదా ఏప్రిల్ 28 వతేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఈ సినిమా 2 తేదీలను ప్రకటించడంతో మరి కొన్ని సినిమాల విడుదలకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ఈ సందర్భంగా ఏప్రిల్ 28వ తేదీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఎఫ్ 3 ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావించారు.
అయితే రాజమౌళి సినిమా కూడా అదే విడుదల తేదీని ప్రకటించడంతో మరోసారి ఈ సినిమా మరో తేదీని ఎంపిక చేసుకోవాలి.ఈ క్రమంలోనే నిర్మాత దిల్ రాజు ఈ విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా సినిమా.అలాంటి సినిమాకు గౌరవం దక్కాలి.ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కాకుండా ఏప్రిల్ 28వ తేదీ విడుదల అయితే ఆ రోజు విడుదల కావాల్సిన మా సినిమాను త్యాగం చేస్తాను.
ఆ రోజు విడుదల కావాల్సిన మా సినిమాని వాయిదా వేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.ఇంకా సంతోషంగా ఫీల్ అవుతానని దిల్ రాజు తెలిపారు.