ఇక్కడ ఎవ్వరూ ఎవర్నీ సపోర్ట్ చెయ్యరు.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు సరైన సపోర్ట్ దక్కడం లేదని చాలామంది హీరోలు ఫీలవుతూ ఉంటారు.

అయితే ఈ కామెంట్ల విషయంలో నెటిజన్ల నుంచి సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు( Dil Raju ) ఎప్పుడైనా తన మనస్సులో ఉండే అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టు చెబుతారు.చిన్న సినిమాల ప్రచారానికి స్టార్స్ రావడం లేదనే కామెంట్ల గురించి దిల్ రాజు స్పందించారు.

ఇండస్ట్రీలో ఎవరూ ఎవర్నీ సపోర్ట్ చేయరంటూ దిల్ రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.చిన్న సినిమాల ప్రచారానికి సెలబ్రిటీలు రావడం లేదని కొంతమంది బాధ పడుతున్నారని కొన్నిరోజుల క్రితం కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఆవేదనను సైతం వీడియోలో చూశానని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

ఈ ఇండస్ట్రీలో ఎవరికి వారు ప్రూవ్ చేసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు.

Dil Raju Sensational Comments Goes Viral In Social Media Details, Dil Raju, Prod
Advertisement
Dil Raju Sensational Comments Goes Viral In Social Media Details, Dil Raju, Prod

ఇక్కడ ఎవరో ఏదో అంటున్నారని భయపడకూడదని దిల్ రాజు అన్నారు.టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారని ఇక్కడ ఎవరూ ఎవడ్నీ సపోర్ట్ చేయరని ఆయన పేర్కొన్నారు.ఎమోషనల్ కావడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

సక్సెస్ దక్కితే ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు అభినందిస్తారని అంతకు మించి ఏమీ చేయలేరని ఆయన తెలిపారు.

Dil Raju Sensational Comments Goes Viral In Social Media Details, Dil Raju, Prod

ఎవరో ఏదో చేస్తారని ఆశిస్తుంటారని అది తప్పు అని దిల్ రాజు పేర్కొన్నారు.ఇక్కడ ఎవరూ ఏమీ చేయరని మమ్మల్ని వెనక్కు లాగేస్తున్నారని ఆయన తెలిపారు.ఎవరి బిజీ వాళ్లదని ఎవరి జీవితాలు వాళ్లవని ఎవరి సినిమాలు వాళ్లవని దిల్ రాజు వెల్లడించారు.

దిల్ రాజు చేసిన కామెంట్లలో నిజం ఉందని ఆయన ఆవేదనలో న్యాయం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.దిల్ రాజు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు