వైట్ రైస్ - బ్రౌన్ రైస్ .. రెండిట్లో ఏది బెటర్ ? తేడాలు ఏంటి ?

మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు రెండు పూటలా తినేది బియ్యాన్నే.కాని ఒకేరకైమైన బియ్యాన్ని.

అదే వైట్ రైస్.అంటే పాలిష్ చేసిన రైస్.

రెండు మూడు సార్లు పాలీష్ చేసిన తెల్లబియ్యాన్ని తింటున్నాం మనం.బ్రౌన్ రైస్ తినడం ఎప్పుడో మానేసాం.అసలు బ్రౌన్ రైస్ అంటూ ఒకటి ఉంటుందని కూడా చాలామందికి తెలియదు.

ఆర్గానిక్ అయిన బ్రౌన్ రైస్ ఖరీదు మనం తినే తెల్ల బియ్యం కంటే రెండు మూడు రెట్లు ఎక్కువే ఉంటుంది.విచిత్రం కదా.బ్రౌన్ రైస్ నుంచే వైట్ రైస్ వస్తుంది.కాని బ్రౌన్ రైస్ ఖరీదే ఎక్కువ.

Advertisement

ఈ రెండిట్లో ఏది తినాలి, ఏది మన ఆరోగ్యానికి మంచిది అంటే ఈజీగా బ్రౌన్ రైస్ అని చెప్పొచ్చు.కాని బ్రౌన్ రైస్ వైట్ రైస్ కన్నా ఎందుకు మంచిది ? రెండిటి మధ్య తేడాలు ఏమిటి ? * మనం అన్నం తినగానే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది.ఎందుకంటే బియ్యంలో కాలరీలు ఎక్కువ ఉంటాయి.1 కప్పు వండిన తెల్ల బియ్యంలో 242 కాలరీలు ఉంటే, అదే ఒక కప్పు బ్రౌన్ రైస్ వండితే 218 కాలరీలు దొరుకుతాయి.కాబట్టి కాలరీలు కరిగేలా కష్టపడుతున్నవారే వైట్ రైస్ తింటే పర్లేదు.

కాని ఒకే చోట కూర్చొని పనిచేసేవారు తెల్లబియ్యంతో సులువుగా బరువు పెరిగిపోతారు.* కార్బ్స్ తక్కువ తీసుకోవాలి, ఫైబర్ తక్కువ తీసుకోవాలి.

అప్పుడు మన రక్తం బాగుంటుంది, ఓవరాల్ గా శరీరం బాగుంటుంది.ఒక బ్రౌన్ రైస్ లో 46 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటే, 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

అదే వైట్ రైస్ అంతే పరిమాణంలో తీసుకుంటే 53 గ్రాముల కార్బోహైడ్రేట్స్, కేవలం 1 గ్రామ్ ఫైబర్ ఉంటుంది.* కొంచెం విటమిన్స్ మరియు మినరల్స్ మీద దృష్టి పెడితే :

విటమిన్ / మినరల్ బ్రౌన్ రైస్ వైట్ రైస్

జింక్ 4% 3% ఐరన్ 2% 1% మేగ్నేషియం 11% 3% మాన్గానీజ్ 45% 23% ఫాస్ ఫరస్ 4% 2% విటమిన్ బి 6 7% 5% థియమిన్ 6% 1% నియాసిన్ 8% 2% ఇంతేకాదు, యాంటి ఆక్సిడెంట్స్, ఫైబర్, ఇతర విటమిన్స్ మరియు మినరల్స్ .ఎలా చూసుకున్న బ్రౌన్ రైస్ దే పైచేయి.* గ్లైకేమిక్స్ ఇండెక్స్ ఎంత ఎక్కువ ఉంటే, ఆ ఆహారపదార్థం షుగర్ వ్యాధి తీసుకొచ్చే ప్రమాదం అంత ఎక్కువ పెరుగుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

బ్రౌన్ రైస్ గ్లైకేమిక్స్ ఇండెక్స్ 50 అయితే, వైట్ రైస్ గ్లైకేమిక్స్ ఇండెక్స్ 89.అదీకాక బ్రౌన్ రైస్ లో ఉండే మేగ్నేషియం, ఫైబర్ వైట్ రైస్ లో ఎక్కువ ఉండవు.కాబట్టి వైట్ రైస్ బ్లడ్ షుగర్ లెవల్స్ ని పెంచుతుంది.

Advertisement

* బ్రౌన్ రైస్ లో గుండెజబ్బుల నుంచి రక్షించే ఎలిమెంట్స్ ఉంటాయి, వైట్ రైస్ లో అవి ఉండవు.ఇంకో పది రకాలుగా రెండిటి మధ్య పోలిక పొంతన చూసినా, బ్రౌన్ రైస్ దే విజయం.

మరి ఈ రెండిట్లో ఏది తింటారో ఇక మీ ఇష్టం.

తాజా వార్తలు