కొడతా అని చెప్పడానికి పార్టీ పెట్టారా.?: రోజా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పవన్ స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

ప్రజలకు ఆయన ఏం చేస్తారో చెప్పకుండా తమను చులకన చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తమను కొడతానని చెప్పడానికి పవన్ పార్టీ పెట్టారా అని రోజా ప్రశ్నించారు.

అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ మంచి చేస్తున్న సీఎం జగన్ ను కాదని పవన్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.ప్రజల దృష్టిలో పవన్ విలన్ గా మారుతున్నారని తెలిపారు.

ఇప్పటికైనా చంద్రబాబు మాట కాకుండా చిరంజీవి మాటను పవన్ వినాలని సూచించారు.పవన్ రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకోవడం మేలన్నారు.

Advertisement

లేదంటే రెండు చోట్ల పరువు పోగొట్టుకుంటారని చెప్పారు.కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చిన తాము భయపడేది లేదని తేల్చి చెప్పారు.

తన ఆరోగ్యంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న జన సైకోల అంతు తేలుస్తానంటూ హెచ్చరించారు.

Advertisement

Latest Latest News - Telugu News