యముడికి కూడా దేవాలయం ఉందని మీకు తెలుసా?

సాధారణంగా మనం దేవాలయాలు అంటే శివుడు, వెంకటేశ్వరుడు, వినాయకుడు, లేదా అమ్మవారి ఆలయాల గురించి వినే ఉంటాము.కానీ ఎప్పుడైనా యముడికి గుడి ఉందని మీకు తెలుసా? అవును యమధర్మరాజుకు కూడా ఒక దేవాలయం ఉంది.

ఆ గుడి మరెక్కడో కాకుండా మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో యమధర్మరాజు కి గుడిని నిర్మించారు.

సాధారణంగా ఇతర దేవాలయాలు పేరు వినగానే,లేదా దేవుని పేరు వినగానే ఎంతో భక్తితో చేతులెత్తి నమస్కరిస్తారు.కానీ యమధర్మరాజు పేరు వినగానే భయభ్రాంతులకు లోనవుతారు.కానీ యమధర్మరాజును  కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

Did You Know Yama Dharma Raja Also Have One Temple, Karimnagar, Yamadrarma Raja,

కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర ఉగ్ర నరసింహుని ఆలయంలో ఈ గుడి ఉంది.ఈ గుడికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారికి విశేష పూజలు అందిస్తున్నారు.

యమధర్మరాజు ఆలయానికి ఎక్కువగా తమ జాతకాలు బాగాలేని వారు, ఎటువంటి పనులు చేసినా కలిసిరాని వారు, మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.ఈ ఆలయంలో యమున్ని దర్శిస్తే ఆ సమస్యల నుంచి విముక్తి పొందుతారని ప్రజల విశ్వాసం.

Advertisement

అంతే కాకుండా శని గ్రహ దోషాలున్నవారు, జాతక దోషాలు ఉన్న వారు ఇక్కడ స్వామి వారిని దర్శించుకోవడం వల్ల ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం.ఈ దేవాలయ మండపంలో గల గండ దీపం లో నూనె పోసి యమధర్మరాజు కు నమస్కరించడం వల్ల యమగండాలు తొలిగిపోతాయి.

ఈ దేవాలయంలో ప్రతి నెల భరణి నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.అంతేకాకుండా దీపావళికి రెండు రోజుల తర్వాత యమద్వితీయ రోజున యముడు తన చెల్లెలి దగ్గరకు భోజనానికి వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు, ఈరోజు ఎవరైతే తమ తోబుట్టువు చేతి వంట తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని ప్రతీతి.15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడికి కార్తీకమాసంలో భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది.

Advertisement

తాజా వార్తలు