బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

బతుకమ్మ అనగానే గుర్తొచ్చే పాట "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.బంగారు బతుకమ్మ ఉయ్యాలో"అనే పాట ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తించింది.ఆశ్వీయుజమాసం మొదలవడంతో బతుకమ్మ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

తొలిరోజు ఎంగిలి బతుకమ్మ తో మొదలై తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ఈ పండుగను ఎంతో సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు.

అయితే ఈ పండుగ విశిష్టత ఏమిటో ఎలా ఉత్సవాలను నిర్వహిస్తారో తెలుసుకుందాం.బతుకమ్మ ఉత్సవాలు మొదలవడంతో ప్రతి ఒక్క ఆడపడుచు పుట్టింటికి చేరుకొని ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.

Advertisement

ఈ బతుకమ్మ పండుగ గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.అయితే ఓ పెద్ద భూస్వాముల ఆకృత్యాలను తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఆవూరి ప్రజలందరూ ఆమెను కలకాలం"బతుకమ్మ"అని దీవించడం వల్ల అప్పటి నుంచి తెలంగాణ ఆడపడుచులు ఈ పండుగను ఎంతో కీర్తి ప్రతిష్టలతో నిర్వహిస్తారు.

ఆశ్వీయుజ మాసం మొదలవడంతో ప్రకృతిమొత్తం పచ్చని రంగుతో చీర కట్టినట్టు, రంగు రంగు పూలతో విరబూసి ఎంతో అందంగా కనువిందు చేస్తుంది.బతుకమ్మ ఉత్సవాలలో తంగేడు పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఈ రంగు రంగు పువ్వులు అన్నింటిని కోసుకొచ్చి ఒక రాగిపళ్ళెంలో ఒకదాని తర్వాత ఒకటి రంగు పువ్వులను పేరుస్తూ, పసుపు తో తయారు చేసిన బతుకమ్మ అందులో పెట్టి ప్రతి ఒక్కరు వారి ఇంటి వాకిలి ముందు బతుకమ్మను పెట్టి ఆడపడుచులు మొత్తం వలయాకారంలో ఏర్పడి బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ, ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.సాయంత్రం బతుకమ్మను తీసుకెళ్లి నీటిలో వదిలి తమను చల్లగా కాపాడమ్మా అంటూ వేడుకుంటారు.

బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఆరోజు ఆడబిడ్డలు అందరూ పట్టు వస్త్రాలు, నగలు ధరించి బతుకమ్మను సిద్ధం చేసుకుని ఊరేగింపుగా వెళ్లి సద్దుల బతుకమ్మ ను జరుపుకుంటారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఈ బతుకమ్మను నీళ్లల్లో వదిలి ,పెళ్లి అయిన వారు దీర్ఘసుమంగళీగా వర్ధిల్లాలని, పెళ్లి కానివారు మంచి భర్త రావాలని నమస్కరించుకుంటారు.బతుకమ్మ ను నీటిలో వదిలిన తర్వాత ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.

Advertisement

తరువాత రొట్టెతో చేసిన మలీద అనే వంటకాన్ని బంధువులందరికీ పంచి తాంబూల పళ్ళెంతో ఇంటికి వెళతారు.ఈ విధంగా తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటారు.

తాజా వార్తలు