కీబోర్డుపై F, Jలపై కనిపించే గుర్తులు టైపింగ్ స్పీడ్‌ను పెంచుతాయని మీకు తెలుసా?

Did You Know That The F And J Symbols On The Keyboard Increase Typing Speed

కంప్యూటర్ అనేది మనిషి దైనందిత జీవితంలోకి వచ్చిన తరువాత జీవితమే స్వర్గధామం అయిపోయింది.ఓ వందమంది చేయగలిగిన పనిని కంప్యూటర్ ఒక్కసారే చేసేయడంతో దాదాపు అన్ని రంగాల్లో దీని వాడకం అనివార్యం అయింది.

 Did You Know That The F And J Symbols On The Keyboard Increase Typing Speed-TeluguStop.com

అవును, ఈ రోజుల్లో కంప్యూటర్ అనేది మానవ జీవితంలో ఒక భాగం అయిపోయింది.ఈ నేపధ్యంలో కంప్యూటర్ వినియోగంపై అందరికీ అవగాహన తప్పనిసరి.

మనలో అనేకమందికి కీ బోర్డు గురించి తెలియని తెలియదు.కంప్యూటర్ వినియోగంలో కీ బోర్డు అనేది అత్యంత ప్రధానమైనది.

ముఖ్యంగా ఈ కీ బోర్డులో F, J కీలకు కిందన ఒక డాష్ గుర్తు ఉంటుంది గమనించారా? ఇది మిగిలిన కీల విషయంలో కనిపించదు.ఇలా ఎందుకు ఉంటుందో ఎపుడైనా గమనించారా? F, Jల కింద కనిపించే ఈ గుర్తును జూన్ ఈ బాటిష్ 2002లో పొందుపరిచారు.ఇప్పుడున్నఅన్ని కీబోర్డులపై ఈ గుర్తు తప్పనిసరిగా ఉంటుంది కదా.ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌ను అనుసరించి కీబోర్డులో కనిపించే F, J బటన్ల కింద కాస్త ఎత్తుగా కనిపించే డాష్ కారణంగా కీ బోర్డును చూడకుండానే టైప్ చేసేందుకు అవకాశం కలుగుతుంది.

Telugu Letters, Key Board, Speed, Ups-General-Telugu

ఉబ్బెత్తుగా వున్న ఆ డాష్ గుర్తును తాకగానే మనకు ఏ బటన్లు ఎక్కడున్నాయో సులభంగా తెలుస్తుందన్నమాట.ఈ గుర్తులను తాకడం ద్వారా మనం టైపింగ్ స్పీడును చాలా తేలికగా పెంచుకోగలుగుతాం.అయితే ఈ రెండు కీల మీద ఇటువంటి గుర్తులను ఏర్పాటు చేసిన ఘనత మాత్రం జూన్ ఈ బాటిష్‌కు దక్కుతుంది.ఫ్లోరిడాకు చెందిన బాటిష్ ఈ ఐడియాను 2002లో అమలులోకి తీసుకు వచ్చారు.

ఇక వాటి వినియోగం తెలిసి పలు కీబోర్డు ఉత్పాదక సంస్థలు తమ కీ బోర్డులపై ఈ గుర్తులను రూపించించడం విశేషం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube