నాలుక రంగును బట్టి మన ఆరోగ్యం డిసైడ్ చేయొచ్చు తెలుసా..?!

శరీరంలో నాలుక ప్రధానమైనది.నాలుక మన శరీరంలో ఉండే రోగాలను ఇట్టే బయటపెడుతుంది.

చిన్న వయసులో వైద్యుని దగ్గరకు వెళ్లితే ఆ డాక్టర్ నాలుకను చూసి ఏ వ్యాధి లక్షణం ఉందో చెప్పేస్తాడు.మన నాలుక మన ఆరోగ్యం గురించి మన అనారోగ్యం గురించి చెప్పేస్తుంది.

నాలుకలోని రక్త నాళాలు బాగా పనిచేస్తూ ఉంటాయి.అవి లాలాజలాన్ని సరఫరా చేస్తూ నాలుక ఎప్పుడూ శుభ్రంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

అందువల్ల హానిచేసే బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది.ఆరోగ్యంగా ఉండే నాలుక రంగు పింక్ రంగులో ఉంటుందని చెప్పొచ్చు.

Advertisement

చాలా సార్లు, మనం తినే ఆహారం వల్ల నాలుక రంగు మారిపోతూ ఉండటాన్ని మనం గమనించవచ్చు.మీ నాలుక పసుపు రంగులో ఉంటే పోషకాహారం కొరత ఉన్నట్టు గ్రహించాలి.

జీర్ణవ్యవస్థలో ఆటంకాలు, కాలేయం లేదా కడుపు సమస్యలు ఉంటే పసుపు నాలుక మనకు కనిపిస్తుంది.నాలుకపై పాచి ఉంటే, నోటి పరిశుభ్రత లేకపోతే మనకు పసుపుగా కనిపిస్తుంది.

పొగతాగేవారికి నాలుక నల్లగా ఉంటుంది.క్యాన్సర్, అల్సర్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండేవారిలో కూడా ఇలా నల్లగా ఉంటుంది.ఎక్కువగా కాఫీ తాగేవారికి కూడా నాలుక నల్లగా ఉంటుంది.

నోరు శుభ్రతగా లేకుంటే నాలుక తెల్లగా ఉంటుంది.మీ శరీరం డీహైడ్రేషన్‌లో ఉందని తెలుపు నాలుక తెలియజేస్తుంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి.. ఫోన్ లాక్కోగానే టీచర్‌ను చంపేస్తానన్న విద్యార్థి.. వీడియో చూస్తే..!

అలాగే నాలుకపై పూత కాటేజ్ చీజ్ పొరలాగా కనిపించినట్లైతే ల్యూకోప్లాకియాని కలిగి ఉండొచ్చని గ్రహించాలి.నీరు బాగా తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

Advertisement

నాలుక ఎరుపుగా ఉంటే శరీరంలో ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ B-12 లోపం ఉంటుందని తెలుసుకోవాలి.శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడి వల్ల కూడా నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది.మీ నాలుక నీలం, ఊదారంగులో ఉన్నట్టైతే మీకు గుండె సంబంధిత సమస్యలు ఉండొచ్చని గ్రహించాలి.

గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయకపోతే, రక్తంలో ఆక్సిజన్ తగ్గితే నాలుక రంగు నీలం లేదా ఊదా రంగులోకి మారిపోతుందని తెలుసుకోవాలి.

తాజా వార్తలు