ఇకనుండి వాట్సాప్ లోనే ఈ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా?

సాధారణంగా మనకి అత్యవసరం అయినప్పుడే కీలకమైన డాక్యుమెంట్స్ గుర్తుకు వస్తాయి.తీరా చూస్తే అవి ఇంట్లో పెట్టి ఉంటాము.

 Did You Know That From Now On You Can Download These Documents On Whatsapp Itsel-TeluguStop.com

అప్పటికే మనం ఎక్కడో బయట ఉంటాము.అలాంటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి.

మరీ ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.అయితే వీటిని మనం మనతో పాటు వాహనంలో తీసుకువెళ్లడం మర్చిపోయినపుడు వీటిని “డిజీలాకర్” అనే యాప్ లో సేవ్ చేసుకోవడం ద్వారా మనం సేఫ్ అవుతాము.

ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు ఈ యాప్ మనకి పనికి వస్తుంది.

ఈ విషయం చాలామందికి తెలుసు.అయితే ఇకపై ఈ యాప్ లో మాత్రమే కాకుండా వాట్సాప్ లో కూడా వీటిని సేవ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది మెటా సంస్థ.అవును, వాట్సాప్ ద్వారా డిజీలాకర్ ఖాతాను(Digilocker) యాక్సెస్ చేసే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం.

వాట్సాప్ ద్వారా ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ (Insurance), 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కుల లిస్టులు వంటివి డౌన్ లోడ్ చేసుకొనే వీలుందిప్పుడు.అయితే వీటన్నింటినీ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ముందుగా మీరు ఒక ఫోన్ నంబర్ ను ఫోన్ లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.

అదే మై జీఓవీ హెల్ప్ డెస్క్ నంబర్ +91 9013151515.దీనిని సేవ్ చేసుకోవడం ద్వారా వాట్సాప్ లోకి వెళ్లి మీరు ఏ పేరుతో అయితే సేవ్ చేసారో ఆ పేరుతో సెర్చ్ చేస్తే మనకు డిజీలాకర్ లోగోతో కాంటాక్ట్ కనబడుతుంది.ఇక అందులోకి వెళ్లిన తరువాత మీరు హాయ్ అని టైపు చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయి.డిజీలాకర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు ఎస్ లేదా నో అనే ఆప్షన్స్ కనబడతాయి.

ఒకవేళ మీకు ఇదివరకే ఈ యాప్ కనుక ఉంటే ఎస్ లేకపోతే నో అని క్లిక్ చేస్తే ఆరిపోతుంది.తరువాత మీ పేరు ఆధార్ కార్డులో(Aadhaar) ఎలాగైతే ఉంటుందో అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

కంటే ముందు డిజీలాకర్ ప్రైవసీ పాలసీని చదివి ఆమోదించాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube