కూరల్లోనే కాదు కరివేపాకును ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా?

కరివేపాకు( curry leaves ) గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో కరివేపాకును విరివిరిగా వాడుతుంటారు.

కరివేపాకు లేనిదే కూరలు అసంపూర్ణం.వంటకు చక్కని రుచి మరియు ఫ్లేవర్ ను అందించడంలో కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

అయితే ఎక్కువ శాతం మంది కరివేపాకును అవసరం లేని ఆకులా చూస్తుంటారు.కూరల్లో వేసిన కరివేపాకును కూడా తీసి పక్కన పెట్టేవారు ఎంతో మంది ఉన్నారు.

కానీ కూరల్లో వేసుకోవడానికి మాత్రమే కాదు కరివేపాకుతో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.కరివేపాకును అనేక విధాలుగా మనం వాడుకోవచ్చు.

Did You Know That Curry Leaves Can Also Be Used Like This Curry Leaves, Curry L
Advertisement
Did You Know That Curry Leaves Can Also Be Used Like This! Curry Leaves, Curry L

జీర్ణ వ్యవస్థను( digestive system ) చురుగ్గా మార్చడంలో కరివేపాకు ఉత్తమంగా సహాయపడుతుంది.ఒక కప్పు ఎండిన కరివేపాకు, మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు వేయించిన జీలకర్ర కలిపి పొడి చేసుకుని పెట్టుకోవాలి.ఈ పొడిని ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్ లో కలిపి తీసుకోవాలి.

ఇలా కనుక చేస్తే అజీర్తి, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ ( Dyspepsia, constipation, gas, acidity )వంటి జీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.అలాగే కాలిన గాయాలను త్వరగా తగ్గించడానికి కూడా కరివేపాకు సహాయపడుతుంది.

కరివేపాకును మెత్తగా గ్రైండ్ చేసి కాలిన గాయాలపై రాయాలి.ఇలా చేస్తే నొప్పి, గాయం రెండు త్వరగా తగ్గుతాయి.

Did You Know That Curry Leaves Can Also Be Used Like This Curry Leaves, Curry L

వికారం, వాంతులు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ లో పావు టీ స్పూన్ కరివేపాకు పొడి,( curry powder ) వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం, వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ) కలిపి తీసుకోవాలి.ఈ విధంగా చేయడం వల్ల ఆయా సమస్య నుంచి ఈజీగా బయటపడతారు.ఇక ఒంట్లో వేడిని తగ్గించే సామర్థ్యం కూడా కరివేపాకుకు ఉంది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

అందుకోసం బ్లెండర్ తీసుకుని ఒక కప్పు పెరుగు వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, కొన్ని అల్లం ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేస్తే లెస్సీ సిద్ధమవుతుంది.

Advertisement

ఈ లస్సీనే తాగితే ఒంట్లో వేడి మొత్తం మాయం అవుతుంది.

తాజా వార్తలు