ఈ ఇద్దరు అనవసరం తొందరపడి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారా..?

సినిమా ఇండస్ట్రీ అనేది అందరికీ కలిసి రాదు.

నిజానికి కొంతమంది మాత్రమే ఇక్కడ సూపర్ సక్సెస్ అవుతుంటే మరి కొంతమంది మాత్రం సక్సెస్ ఫుల్ హీరోలుగా పేరు సంపాదించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అయిన కూడా వాళ్లకు మాత్రం అంత పెద్దగా సక్సెసులు అయితే రావు.ఇక మరికొందరు మాత్రం చేసిన రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరోలుగా గుర్తింపు పొందుతూ ఉంటారు.

ఇక ఇదిలా ఉంటే యంగ్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్, కిరణ్ అబ్బవరం( Raj Tarun ) లాంటి హీరోలు ఇప్పుడు హీరోలుగా చేస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు లుగా కూడా చేస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక కిరణ్ అబ్బవరం దేవర సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

Did These Two Take Such A Decision In Unnecessary Haste ,kiran Abbavaram, Social

అలాగే రాజ్ తరుణ్( Raj Tarun ) కూడా ఇప్పటికే నాగార్జున హీరోగా చేసిన నా సామి రంగ( Naa Saami Ranga ) సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.ఇక మొత్తానికైతే వీళ్లిద్దరు ఇండస్ట్రీలో అటు హీరోలుగా చేస్తూనే, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టు లుగా మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.ఇక వీళ్లకు మొదట్లో చాలా మంచి పేరు వచ్చినప్పటికి ఆ తర్వాత సినిమాలు ప్లాప్ అవ్వడం తో ఆ క్రేజీ తగ్గింది.

Advertisement
Did These Two Take Such A Decision In Unnecessary Haste ,Kiran Abbavaram, Social

మొదట్లో సినిమాలు సక్సెస్ అవ్వడంతో అందరి దృష్టి వీళ్ళ వైపు మళ్ళింది.కానీ తర్వాత వీళ్ళు ఆ పేరు నిలబెట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయారు.

Did These Two Take Such A Decision In Unnecessary Haste ,kiran Abbavaram, Social

దానికి కారణం మంచి కథలను ఎంచుకోకపోవడమే అంటూ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.ఒకసారి కనక మంచి క్యారెక్టర్ దొరికినట్లైతే వరుసగా మరొక మూడు, నాలుగు సినిమాలతో సక్సెస్ ఆందుకునేవారు.అలా అయితే ఇప్పటికే వాళ్ళు స్టార్ హీరోలుగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉండేవి.

అయినప్పటికీ ఇప్పుడు కూడా మంచి సినిమాలను చేసి సక్సెస్ ఫుల్ హీరోలుగా ఎదుగుతారా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మిగులుతారా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు