నటి సమంత ( Samantha ) సినీ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాగా ఏమాయ చేసావే సినిమా ని చెప్పుకోవచ్చు.ఈ సినిమాతోనే సమంత టాలీవుడ్ కి పరిచయమైంది.
అలాగే మొదటి సినిమానే సమంతకి మంచి పేరు తెచ్చి పెట్టడంతో ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.అంతేకాదు ఒక రకంగా అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లడానికి కారణమైన సినిమాగా కూడా ఈ మూవీనే చెప్పుకోవచ్చు.
ఇక ఈ సినిమా సమయంలోనే చైతు సమంత ( Chaithu, Samantha ) ఇద్దరు ప్రేమలో పడ్డారు.అలా వీరి ప్రేమకు ఈ సినిమా షూటింగ్ సమయంలో బీజం పడి చివరికి పెళ్లి వరకు వెళ్లి పెళ్లి చేసుకొని కొద్ది రోజులు సంతోషంగా ఉండి ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు.
అయితే ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు అంటే ఆ సినిమా కోసం ముందుగా ఎంతో మందిని సంప్రదిస్తూ ఉంటారు.ఇక అలా అప్పట్లో సమంత కంటే ముందే మరో హీరోయిన్ ని ఈ మూవీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ సంప్రదించారట.కానీ ఇటు సమంత అటు ఆ హీరోయిన్ ఇద్దరి మధ్య గౌతమ్ మీనన్</em ( Goutham menon ) ఎవరికి ఛాన్స్ ఇవ్వాలో తెలియక సతమత పడ్డారట.దాంతో వీరిద్దరికి ఒక టాస్క్ ఇచ్చారట.
ఇక ఈ టాస్క్ లో సక్సెస్ అయి సమంత ఏ మాయ చేసావే ( E maya Chesave ) సినిమాలో హీరోయిన్ రోల్ సంపాదించింది.అయితే ఈ సినిమా సమయంలో సమంత 10 ఆడిషన్ వే ఆఫ్ స్టైల్ కి ఫిదా అయిన గౌతమ్ మీనన్ ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారట.
అంతేకాదు సమంతలో ఉన్న వెరైటీ యాక్టింగ్ స్కిల్స్ ఇప్పటికి కూడా గౌతమ్ మీనన్ మర్చిపోలేక పోతున్నారట.
ఆ కారణంతోనే సమంత ( Samantha ) ఆరోగ్యం బాగాలేక ఆమె మొహం పీలగా మారిపోయిన కూడా మళ్లీ మళ్లీ ఆమెతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకనిర్మాతలు భావిస్తారని తెలుస్తోంది.ఇక గౌతమ్ మీనన్ కూడా ఇప్పటికీ తాను తీయబోయే కొన్ని సినిమాలకు సమంత ను అప్పుడప్పుడు తీసుకోవాలని అనుకుంటారట.అలా సమంత ఏమాయ చేసావే సినిమా సమయంలో తనలో ఉన్న డిఫరెంట్ యాక్టింగ్ ని బయటపెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారింది.