రేవంత్ రెడ్డి కి తిరుగులేదా ? స్ట్రాంగ్ అయ్యారుగా ? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )పార్టీలోనూ,  ప్రభుత్వంలోనూ తనకు తిరిగే లేదన్నట్లుగా పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నారు.

గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ను ఏకతాటి పైకి తీసుకువచ్చి,  పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ అనుకున్న మేర సక్సెస్ అయ్యారు .

దీంతోనే పార్టీ అధిష్టానం కూడా సీనియర్లను సైతం పక్కనపెట్టి రేవంత్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది.పార్టీలోని గ్రూపు రాజకీయాలను చక్కదిద్దడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు .ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లోనే ఆయన ఎంతో కాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం లేదనే ప్రచారం  జరిగింది.  దీనికి తోడు బీఆర్ఎస్ ( BRS )నేతలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని , కేసీఆర్( KCR ) మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ పదేపదే వ్యాఖ్యానించడం వంటివి కాస్త గందరగోళానికి గురిచేసినా,  ఆ తర్వాత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు.

Did Not Return To Revanth Reddy Are You Strong

పార్లమెంట్ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలవకుండా రేవంత్ మార్క్ రాజకీయం చేసి సక్సెస్ అయ్యారు .ఇక కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు.ముఖ్యంగా రైతు రుణమాఫీ తో పాటు,  కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ ల అమలు విషయంలోనూ జనాల్లో నమ్మకం కలిగించారు.

మొదట్లో రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా వ్యవహరించినా,  ఆ తరువాత అంతా రేవంత్ ను సమర్థిస్తూనే వస్తున్నారు .ఇక దళిత సామాజిక వర్గానికి చెందిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్కకు  రేవంత్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.  ప్రతి కార్యక్రమంలో తన వెంట భట్టి ఉండేలా చూసుకుంటున్నారు .

Did Not Return To Revanth Reddy Are You Strong
Advertisement
Did Not Return To Revanth Reddy Are You Strong-రేవంత్ రెడ్�

ఢిల్లీకి వెళ్లినా,  మరే కార్యక్రమానికి హాజరైనా తన వెంట భట్టి విక్రమార్క ఉంటున్నారు.ఈయనతో పాటు, పార్టీ సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు తనకు మద్దతు దారులుగా ఉండేలా చేసుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు.ఇక బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహించడంలోనూ రేవంత్ సక్సెస్ అయ్యారు .ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు చాలావరకు కాంగ్రెస్ లో చేరిపోయారు .ఇంకా అనేకమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.మొత్తంగా చూస్తే అటు పార్టీలోనూ,  ప్రభుత్వంలోనూ తనకు తిరిగే లేదన్నట్లుగా పరిస్థితులను మార్చుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు