మెగా బ్రదర్ నాగబాబు ( Nagababu ) కొడుకు వరుణ్ తేజ్ పెళ్లిలో అలాంటి తప్పు చేశాడు అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అంతేకాదు అన్నీ తెలిసి ఉన్న పెద్దాయన అయి ఉండి కూడా అలాంటి తప్పు ఎలా చేస్తారు.
అది అరిష్టం కదా అని కొంతమంది నెటిజన్లు ఆ ఫోటోలను చూసి కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ నాగబాబు చేసిన ఆ తప్పేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నాగబాబు ఒక్కగానొక్క కుమారుడు వరుణ్ తేజ్ తాను ప్రేమించిన నటి లావణ్య త్రిపాటి ( Lavanya tripathi ) తో నవంబర్ 1 న అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీ లో పెళ్లి పీటలు ఎక్కారు.

ఇక వీరికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.ఇక ఈ ఫోటోలన్నింటిలో హైలెట్ గా నిలిచిన ఫోటో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కళ్యాణ మండపంలో ముందు కూర్చుని ఉంటే వారి వెనకే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్( Ram charan ) ,సాయి ధరంతేజ్,చిరంజీవి, అల్లు అర్జున్( Allu Arjun ) ,వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్,నాగబాబులు నిల్చొని ఉన్నారు.ఇక ఈ ఫోటో చూడడానికి రెండు కళ్ళు చాలా లేదనుకోండి.
ఇక అంతా బాగానే ఉన్నప్పటికీ కల్యాణ మండపంలో అందరూ చెప్పులు లేకుండా నిలుచుంటే కేవలం నాగబాబు మాత్రం చెప్పులు వేసుకుని నిలుచున్నారు.ఇక నాగబాబు చెప్పులు వేసుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ కల్యాణ మండపంలోకి చెప్పులు వేసుకుని రాకూడదని ఆ మాత్రం కూడా సంస్కృతి సంప్రదాయాలు తెలియదా అంటూ నాగబాబుని కొంతమందిని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
అంతేకాదు గుడి లాంటి కల్యాణ మండపంలోకి చెప్పులు వేసుకోకూడదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు అలాంటిది నాగబాబుకు తెలియదా అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.







