ప్ర‌ధాని మోడీ ఫోక‌స్ ఆ మూడింటిపైనేనా..? మ‌న రాష్ట్రాల్లో సాధ్య‌మేనా..?

ప్ర‌ధాని మోడీ అనుస‌రిస్తున్న తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న‌ప్ప‌టికీ మోడీ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు.ట్రేడ్ (వాణిజ్యం) టూరిజం (పర్యాటకం) టెక్నాలజీ (సాంకేతికం) అన్నవి ప్రధాన సూత్రాలుగా మోడీ కొత్త విధానం ఒకటి అవలంబించేందుకు సన్నద్ధం అవుతున్నారు.

 Is Prime Minister Modi Focus On Those Three Is It Possible In Our States Details-TeluguStop.com

నిన్నటి నీతి అయోగ్ సమావేశంలో కూడా ఇవే చెప్పారు.వీటి కారణంగా దేశం రానున్న మరో ఇరవై ఏళ్లలో మంచి ఫలితాలనే అందుకోనుందని అంటున్నారు.

అయితే అందుకు సిద్దంగా దేశం ఉందా? లేదా అన్నదే ఇప్పుడు కీలకం.ఈ నేపథ్యంలో టూరిజం కు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో ఉన్న పురోగతి ఎలా ఉందో లెక్క‌లేసుకుటే….ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత టూరిజం పరంగా జరిగిన అభివృద్ధి అంతా ఓ విధంగా హైదరాబాద్ కేంద్రంగానే ఉండిపోయింది.

ఏపీలో అనుకూల వాతావ‌ర‌ణం ఉందా.!

అదేవిధంగా రామోజీ వంటి సంస్థ‌లు కూడా ఇక్క‌డే ఉండ‌టం తెలిసిందే.అంతే కాకుండా ఆర్థిక చేయూత అయింది.

అదేవిధంగా మిగిలిన కొన్ని అభివృద్ది పనులు కూడా తెలంగాణ ప్రభుత్వ పరంగా చేపట్టిన సందర్భాల్లో బాగానే ఫలితాలు ఉన్నాయి.హైద్రాబాద్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో అంత అభివృద్ధి లేదనే వాద‌న వినిపిస్తోంది.

అస‌లు విజయవాడ, విశాఖకు ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన రోడ్లే లేవ‌నే విమ‌ర్శ కూడా ఉంది.రోడ్ కనెక్టివిటీ పెంచితేనే టూరిజం సెక్టార్ అభివృద్ధి అన్నది సాధ్యం.

అదేవిధంగా వాణిజ్య పరంగా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడిదారీ అనుకూల వాతావరణం అంటూ ఏమీ లేద‌నే వాద‌న కూడా ఉంది.

Telugu Ap Cm Jagan, Hyderebad, Niti Aayog, Pm Modi, Telangana, Telugu, Tourism,

ప్రోత్సాహ‌కాలు త‌క్కువ‌…

అలాగే పారిశ్రామిక ప్రోత్సాహకాలు కూడా పెద్ద‌గా లేవ‌ని అంటున్నారు.అయితే హైద్రాబాద్ మాత్రం ఆశించిన స్థాయి కన్నా ఎక్కువే అభివృద్ధిలో ఉంది.ఇక ఇటు విశాఖ ఆ విష‌యంలో వెనుకబడిపోయిందంటున్నారు.

కనుక మోడీ చెప్పిన విధంగా రానున్న కాలంలో అభివృద్ధి నినాదం ఫలితం ఇవ్వాలంటే ఏపీ స‌ర్కారు తీరులో మార్పు రావాలని నిపుణులు అంటున్నారు.మ‌రి కేంద్రం అనుస‌రిస్తున్న వాణిజ్యం, ప‌ర్యాట‌కం, సాంకేతిను తెలుగు రాష్ట్రాల్లో సాధ్యం కావాలంటే మ‌న ప్ర‌భుత్వాల్లో కూడా మార్పు రావాల‌ని కోరుతున్నారు.

అది జ‌రిగే ప‌నేనా చూడాలి మ‌రి…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube