ఎలక్షన్స్ అప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ తో ఆ ఒక్క మాట చెప్పాడా..?

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఆయన ఇప్పటికే ఎన్నో శిఖరాలను అధిరోహించి సినిమా ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంతో ఏలుతున్నాడు.

ఇక ఇప్పటికి కూడా ఆయన ఏ హీరోకి తగ్గకుండా ఫైట్లు చేస్తూ ప్రేక్షకుల అందరిచేత విజిల్స్ వేయిస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ప్రస్తుతం విశ్వంభర( Vishwambhara ) అనే సినిమాని చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు.ఇక తన తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే.

అయితే ఎలక్షన్స్ కి( Elections ) ముందు పవన్ మీద చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే దుర్భాషలాడుతూ రకరకాల కామెంట్లు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఇక ఆ విషయాలను చిరంజీవితో చెబుతూ కోపానికి వచ్చాడట.ఇక చిరంజీవి మాత్రం ఆయన తమ్ముడికి ఓపికగా ఉండమని చెప్పాడట.ఇక ఇప్పుడు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు అంటూ పవన్ కళ్యాణ్ కి చాలా భరోసా ని ఇచ్చాడట.

అందుకే చిరంజీవి చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ విజయం సాధించాడు.

Advertisement

ఇక ఆ ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత చిరంజీవి దగ్గరికి వెళ్లి అతని కాళ్ళ మీద కూడా పడిన వీడియోని మనందరం చూశాం.ఇక మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జనసేన పార్టీకి( Janasena Party ) ఐదు కోట్ల విరాళం కూడా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండటం తో పవన్ కళ్యాణ్ అభిమానులతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం లో చాలా మంచి డెవలప్ మెంట్ చేసి చూపిస్తాడు అనేది మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు