విశాఖలోని భూ కుంభకోణంలో సిట్ నివేదికపై మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు.నివేదిక పబ్లిక్ డొమైన్ లో ఉంటుందన్న ఆయన కావాలంటే చూసుకోవాలని చెప్పారు.
తన పేరు ఉందా? లేదా? అన్నది తెలుస్తుందని తెలిపారు.భూములను ఇచ్చే అధికారం రెవెన్యూ మంత్రికి ఉండదని పేర్కొన్నారు.
కేబినెట్ మరియు కలెక్టర్ కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.తనపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు.
జగన్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూ సంస్కరణలు తెచ్చామని తెలిపారు.ఇందులో భాగంగానే పేదల కోసం అనేక చట్టాలు తెచ్చి భూ పంపిణీ చేశామన్న ఆయన రాష్ట్రంలో 34 వేల మంది పేదలకు భూమి పంపిణీ చేశామన్నారు.
రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడం ద్వారా వచ్చే డబ్బులు సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగపడుతుందని వెల్లడించారు.







