'సార్‌' ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చేది ఎప్పుడో చెప్పండి ప్లీజ్‌

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ తెలుగు లో ఎంట్రీ ఇవ్వబోతున్న సార్ సినిమా యొక్క ఫస్ట్‌ లుక్ మరియు టీజర్ ను విడుదల చేశారు.

ధనుష్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

వెంకీ అట్లూరి కి మరో సూపర్ హిట్ ఖాయం అంటూ తెలుగు ప్రేక్షకులు అంటున్నారు.ఈ సినిమా తో వెంకీ అక్కడ.

ధనుష్‌ ఇక్కడ మంచి మార్కెట్ ను క్రియేట్‌ చేసుకోవడం ఖాయం అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో సార్ సినిమా యొక్క విడుదల తేదీ పై కూడా చర్చ జరుగుతోంది.

సినిమా యొక్క టీజర్ ను విడుదల చేయబోతున్నారు అనగానే వెంటనే అంతా కూడా సార్ విడుదల తేదీ ఎప్పుడు అంటూ చర్చించుకున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సార్ విడుదల తేదీని ఇప్పట్లో ప్రకటించే అవకాశం లేదు.

Advertisement

ఎందుకంటే ధనుష్‌ నటించిన.నటిస్తున్న సినిమా లు విడుదలకు సిద్ధం గా ఉన్నాయి.

ఆ సినిమా ల యొక్క విడుదల తేదీ ల పై ఒక క్లారిటీ ఇవ్వాలి.ఆ తర్వాత మాత్రమే సార్‌ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా ధనుష్‌ సన్నిహితులు చెబుతున్నారు.

సినిమా మేకింగ్ కు మరో రెండు నుండి మూడు నెలల సమయం పడుతుందని వెంకీ టీమ్‌ నుండి సమాచారం అందుతోంది.కనుక సినిమా ఖచ్చితంగా ఈ ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఏడాది ఆరంభం లో వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియా లో సినిమా పై అంచనాలు భారీ గా ఉన్న నేపథ్యం లో ధనుష్‌ ను త్వరగా సార్ గా రమ్మంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ధనుష్‌ నుండి సార్ విడుదల తేదీ ప్రకటన రాకపోవడం పట్ల తమిళ ఫ్యాన్స్ కూడా ఒకింత నిరుత్సాహంతో ఉన్నారు.

ఆరోగ్యంగా లేమని చెప్పటానికి సూచనలు..
Advertisement