'కెప్టెన్ మిల్లర్'పై ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వారందరికీ థాంక్స్ చెబుతూ..

గ్లోబల్ స్టార్ ధనుష్( Dhanush ) ప్రజెంట్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ కేరీర్ లో దూసుకు పోతున్నాడు.

 Dhanush Interesting Post On Captain Miller Details, Dhanush, Captain Miller, Cap-TeluguStop.com

ఇటీవలే ధనుష్ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ సినిమా ( Sir Movie ) చేయగా సూపర్ హిట్ అయ్యింది.తమిళ్ తో పాటు తెలుగులో కూడా హిట్ అయ్యి ఈయన మార్కెట్ మరింత పెరిగింది.

ఇలా వరుస హిట్స్ తో దూసుకు పోతున్న ధనుష్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.ఈయన ప్రజెంట్ కెప్టెన్ మిల్లర్ తో( Captain Miller Movie ) పాటు శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాల్లో కెప్టెన్ మిల్లర్ ముందు రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి తాజాగా ధనుష్ సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసాడు.

ధనుష్ కెరీర్ లోనే బెంచ్ మార్క్ చిత్రం 50వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు ధనుష్.ఈ సినిమా షూట్ మొత్తం అయిపోయిందని.తన చిత్ర యూనిట్ కు థాంక్స్ చెబుతున్నట్టు తెలిపాడు.

అలాగే నిర్మాతలు కళానిధి మారన్, సన్ పిక్చర్స్ నా విజన్ ను నమ్మి నా తోనే ఉన్నందుకు థాంక్స్ అంటూ తెలిపాడు.దీంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.కాగా నిన్న ధనుష్ అతి త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో.

కాగా ప్రియాంక మోహన్ ( Priyanka Mohan ) హీరోయిన్ గా డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్( Arun Matheswaran ) తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.కాగా జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube