ధన త్రయోదశి రోజు రాత్రంతా దీపాలను ఎందుకు వెలిగిస్తారో తెలుసా..?

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వీయుజ మాసం కృష్ణ త్రయోదశి ని ధన త్రయోదశి అని పిలుస్తారు.ఈ ఏడాది ధనత్రయోదశి నవంబర్ 2వ తేదీ వచ్చింది.

ఈ ధన త్రయోదశి కొన్ని ప్రాంతాలలో చిన్న దీపావళి అని కూడా పిలుస్తారు.ధన త్రయోదశి దీపావళికి రెండు రోజుల ముందు వస్తుంది.

Dhanteras 2021 Why People Purchase Gold On Dhanteras, Dhanteras, Dhanteras 2021,

అయితే ధన త్రయోదశి రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి ఉద్భవించి ఉందని అందుకోసమే ఆరోజు లక్ష్మీదేవికి పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు.అయితే ధన త్రయోదశి రోజు చాలామంది బంగారు వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

ఇలా ధన త్రయోదశి రోజు బంగారు వెండి ఆభరణాలను కొనుగోలు చేయడానికి గల కారణం ఏమిటి,అలాగే యమధర్మరాజుకు గౌరవసూచకంగా ఈరోజు రాత్రంతా దీపాలు ఎందుకు వెలిగిస్తారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.పురాణాల ప్రకారం హిమా అనే రాజు తన 16 సంవత్సరాల కొడుకు వివాహం చేశారు.

Advertisement

అయితే వివాహమైన కొద్ది రోజులకే ఒక పాము కరవడంతో అతను మరణం వరకు వెళ్ళాడు.సాధారణంగా పాము కరిచిన వారు రాత్రి పూట నిద్రపోరు ఈ క్రమంలోనే యువరాజును బ్రతికించుకోవటం కోసం తన భార్య తనని రాత్రంతా నిద్రపోకూడదు అని చెప్పి తనకు కథలు చెబుతూ ఉంది.

ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న బంగారం మొత్తం ఇంటి గుమ్మం దగ్గర ఉంచింది.అదే సమయంలోనే యమధర్మరాజు పాము రూపంలో ఆ రాజు ప్రాణాలను తీసుకువెళ్లడానికి వచ్చాడు.

అయితే గుమ్మం దగ్గరకు రాగానే బంగారు ఆభరణాల ప్రదర్శన వల్ల చూపు కోల్పోయాడు.ఈ క్రమంలోనే పాము రూపంలో ఉన్న యమధర్మరాజు గుమ్మం దాటి లోపలికి ప్రవేశించలేకపోయాడు.

అలా తెల్లవార్లు ఆ పాము బంగారు నగలపై కూర్చుని ఉదయమే తిరిగి వెళ్ళిపోయింది.ఈ క్రమంలో యమధర్మరాజు ఆ రాజు ప్రాణాలను తీసుకోలేక పోయాడు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అప్పటినుంచి యమధర్మరాజు గౌరవానికి సూచిక ధన త్రయోదశి రోజు రాత్రంతా దీపాలను వెలిగిస్తారు.

Advertisement

తాజా వార్తలు