కుంభమేళాలో ల్యాప్‌టాప్‌తో దర్శనమిచ్చిన భక్తుడు.. నెటిజన్లు షాక్!

ప్రయాణాలంటే అందరికీ ఇష్టమే ఉంటుంది.కానీ చాలా కంపెనీల్లో సెలవులు దొరకడం నరకయాతనతో సమానం.

బాస్‌ని బతిమలాడాలి, లీవ్ లెటర్లు పెట్టాలి, పైగా పని పెండింగ్‌లో పెట్టకూడదు అనే టెన్షన్ వేరే.అయితే, వర్క్ ఫ్రమ్‌ హోమ్ (Work from home)పుణ్యమా అని కొంతమంది ఉద్యోగులకు కొంచెం రిలీఫ్‌, కాస్త వెసులుబాటు దొరికింది.

ఎక్కడైనా కూర్చొని పని చేసే ఫ్లెక్సిబిలిటీ వాళ్ల సొంతం.సరిగ్గా ఈ విషయాన్ని గుర్తు చేసేలా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

అది ఎక్కడో కాదు, మహా కుంభమేళాలో!కుంభమేళా(Kumbh mela) అంటే జనాలు కిక్కిరిసిపోయి ఉంటారు.అలాంటి రద్దీలో ఒక వ్యక్తి మాత్రం ల్యాప్‌టాప్‌లో (laptop)మునిగిపోయి కనిపించాడు.

Advertisement

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో (Maha Kumbh Mela)తీసిన ఈ ఫొటోని చూడగానే నెటిజన్లు రకరకాల కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు."ఇతను కచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగే అయి ఉంటాడు, అందుకే కుంభమేళాలో కూడా ఆఫీస్ మీటింగ్‌లో పాల్గొంటున్నాడు" అని కొందరు అన్నారు.

ఇంకొందరైతే ఒక అడుగు ముందుకేసి "అబ్బే, అతను పనేం చేయడం లేదు, 2025లో జరిగే కుంభమేళాకి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటున్నాడేమో" అని జోకులు పేల్చారు.

ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.ఫోటోలో ఉన్న వ్యక్తి ప్రయాగ్‌రాజ్‌లోని (Prayagraj)ఇసుక నేల మీద కూర్చొని ల్యాప్‌టాప్ వాడుతున్నాడు.ఒక చేత్తో ఫోన్ పట్టుకొని, ఇంకో చేత్తో ల్యాప్‌టాప్ కర్సర్‌ని కదుపుతున్నాడు.

చుట్టూ జనం స్నానాలు చేసి బట్టలు మార్చుకుంటూ హడావిడిగా తిరుగుతున్నా, ఇతను మాత్రం చాలా ప్రశాంతంగా తన పనిలో నిమగ్నమై ఉన్నాడు.ఈ వింత సీన్ చూసిన అక్కడి జనాలు ఆశ్చర్యపోయారు.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

ఇక నెటిజన్లు అయితే ఈ ఫోటోని చూసి పగలబడి నవ్వారు.

Advertisement

అలాగే ఫన్నీ కామెంట్లతో ఫోటోని మరింత వైరల్ చేసేశారు.ఒక నెటిజన్ అయితే "వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కలిగే అసలు సిసలైన లాభం ఇదే.కుంభమేళాలో కూడా పని చేసుకోవచ్చు" అని కామెంట్ చేశాడు.ఇంకో నెటిజన్ మాత్రం కాస్త జాలి చూపిస్తూ "ఈ ఫోటో కనుక వాడి బాస్ చూస్తే అంతే సంగతులు, ఉద్యోగం ఊడిపోతుంది.

" అని కామెంట్ పెట్టాడు.ఆ ఫోటో వాడి బాస్‌కి చేరకుండా ఉంటే మంచిదని, లేదంటే ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం ఉందని ఆ నెటిజన్ భయం.మొత్తానికి ఈ ఫోటో మాత్రం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

తాజా వార్తలు