బన్నీ శాపం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వరమైందా.. ఆ మార్క్ ను తారక్ టచ్ చేశారా?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప 2.

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో పుష్ప2 కూడా ఒకటి.

ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఎలా అయినా ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావించారు.

ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చేశారు.దాంతో పుష్ప 2( Pushpa 2 )ఆగస్ట్ 15న విడుదల అవుతుంది కదా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా ఇంతలోనే అభిమానులను నిరాశ పరుస్తూ ఈ సినిమా విడుదల తేదీని మార్చేశారు.

Devara Takes Advantage Of Pushpa 2 Delay, Devara, Pushpa 2, Tollywood, Allu Arju

ఇప్పుడు ఇంకో నాలుగు నెలలు అదనంగా నిరీక్షించాల్సి వస్తోంది.పుష్ప-2 వాయిదా వల్ల చాలా సినిమాల షెడ్యూళ్లు కూడా తారుమారు అయ్యాయి.పుష్ప-2 బడ్జెట్, బిజినెస్ మీద కూడా వాయిదా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది.అయితే వేరే సినిమాలు కొన్నింటికి పుష్ప 2 వాయిదా నిర్ణయం ప్లస్ అవుతోంది.

Advertisement
Devara Takes Advantage Of Pushpa 2 Delay, Devara, Pushpa 2, Tollywood, Allu Arju

క్రేజీ డేట్‌ అయిన ఆగస్ట్ 15ను వాడేసుకోవడానికి డబుల్ ఇస్మార్ట్ ( Double iSmart )లాంటి చిత్రాలు కర్చీఫ్ వేసేస్తున్నాయి.మరోవైపు పుష్ప 2 వాయిదా నిర్ణయం జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర( Devara ) క్రేజ్, బిజినెస్‌ను పెంచిందని టాక్.

అయితే ప్రభాస్ నటించిన కల్కి సినిమా తర్వాత అందరి చూపు కూడా ఈ సినిమా వైపే ఉండేది.

Devara Takes Advantage Of Pushpa 2 Delay, Devara, Pushpa 2, Tollywood, Allu Arju

కానీ ఒక్కసారిగా ఈ సినిమా వాయిదా పడడంతో ప్రేక్షకుల ఫోకస్ అంటే దేవర సినిమా మీదకు వెళ్ళింది.అయితే ఈ మధ్యలోనే ఇంకా కొన్ని పెద్ద పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి.కానీ పుష్ప 2 తర్వాత అందరి చూపు అందరు దుష్టి దేవర సినిమా పైనే ఉంది.

ఒక రకంగా చెప్పాలంటే పుష్ప సినిమా వాయిదా పడడం దేవర సినిమాకు బాగా ప్లస్ అయిందని చెప్పాలి.మరి దేవర సినిమా విడుదల తేదీని మారుస్తూ పుష్ప సినిమా విడుదల అయ్యే సమయానికి విడుదల చేస్తారో లేదో చూడాలి మరి.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు