ప్రశాంతంగా వుండే దెందులూరులో కావాలనే వైసీపీ హింసను ప్రేరేపిస్తుంది - చింతమనేని

ప్రశాంతంగా వుండే దెందులూరులో కావాలనే వైసీపీ అహింసను ప్రేరేపిస్తుందని ఆరోపించిన చింతమనేని.దిశ డీఎస్పీ దగ్గరుండి మరి టీడీపీ వాళ్లను కొట్టించారు.

టీడీపీ కార్యకర్తలను కావాలనే భయాందోళనకు గురిచేస్తున్నారు.నాకు ప్రాణ హానివుందని కంప్లైంట్ చేస్తే ఇప్పటివరకు కేసు ఫైల్ చేయలేదు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని మా కార్యకర్తను అరెస్ట్ చేసి దగ్గరుండి పోలీస్ లు మావాళ్లను కొట్టించారు.

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. పోలీస్ లపైన కూడా ప్రైవేట్ కేసులు పెడతాం.

అవసరమయితే సాయంత్రానికి మా అధినేత చంద్రబాబు కూడా వస్తా అన్నారు.పరిస్థితులు చక్కబడే వరకు చింతమనేని వద్దే ఉండమన్నారు.

Advertisement

గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇటువంటి అరాచకాలను మానుకోవాలి లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు