ఫోటో కోసం ఫేక్ నవ్వు నవ్వకు.. తండ్రిని ఆ మాట అనేసిన దీప్తి సునైనా.. అతడి రియాక్షన్ అదే!

బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరై ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న దీప్తి సునయన గురించి అందరికీ తెలిసిందే.

హౌస్ లో ఉన్నంత కాలం బాగా అల్లరి చేస్తూ, ఎమోషనల్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

బిగ్ బాస్ షో కంటే ముందు డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించింది.

అలా బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా తన కెరీర్ మొత్తం బిగ్ బాస్ తో మొదలైందని చెప్పవచ్చు.ఇక బిగ్ బాస్ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.

మంచి సక్సెస్ లు అందుకుంది.మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Advertisement

అంతేకాకుండా సింగర్ గా కూడా బాగా మెప్పించింది.ఇక దీప్తి సునయన మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.

ఇక వీరిద్దరూ కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.దీంతో వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది.

కొంతకాలం వరకు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ లా ఉన్నట్లు అందరినీ నమ్మించారు.కానీ కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుందని అనుమానాలు వచ్చాయి.

అంతేకాకుండా టాటులు కూడా ఒకేలా వేయించుకోవటంతో బాగా అనుమానాలు రావడంతో బిగ్ బాస్ సీజన్ 5 తో నిజమైంది.

బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమం ఏ సమయంలో చేయాలో తెలుసా..!

పలు బుల్లితెర షో లలో కూడా వీరిద్దరు జంటగా పాల్గొని బాగా రచ్చరచ్చ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇటీవలే ముగిసిన సీజన్ 5 లో షణ్ముఖ్ పాల్గొని రన్నరప్ గా నిలిచాడు.ఈ సీజన్ ప్రారంభంలో షన్ను బాగా సైలెంట్ గా డీల్ చేసాడు.

Advertisement

ఆ తర్వాత మరో కంటెస్టెంట్ సిరి అతడి లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వటంతో షన్ను లైఫ్ మొత్తం మారిపోయింది.మొత్తానికి నెగిటివిటిని మూటగట్టుకున్నాడు.ఆల్రెడీ దీప్తి సునయన తో లవ్ లో ఉన్నాడు.

ఓసారి దీప్తి సునయన కూడా అదే వేదికపై షణ్ముఖ్ కు లవ్ ప్రపోజల్ కూడా చేసింది.దీంతో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని అందరికీ క్లారిటీ వచ్చింది.

అయినా కూడా షన్ను సిరితో మితిమీరి హద్దులతో ప్రవర్తించడంతో బాగా విమర్శలు ఎదుర్కొన్నాడు.

అంతేకాకుండా షో నుండి బయటికి వచ్చాక దీప్తి సునయనను దూరంగా ఉంచటంతో.దీప్తి అస్సలు నిర్ణయాన్ని తీసుకుంది.ఇక షన్ను తో తన రిలేషన్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెప్పుకుంది.

ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.ఇక ఆరోజు నుంచి దీప్తి బాగా ఎమోషనల్ గా ఉంటుంది.

సోషల్ మీడియా వేదికగానే తాను రిఫ్రెష్ అవుతుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా సందడి చేస్తుంది.

అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.ప్రస్తుతం పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాటు పలు ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక తాజాగా తన తండ్రితో సెల్ఫీ దిగుతున్న వీడియో పంచుకోగా అందులో ఫోటో కోసం ఫేక్ నవ్వు నవ్వకు అని అనడంతో వెంటనే తన తండ్రి ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఫొటోకు స్టిల్ ఇచ్చాడు.

తాజా వార్తలు