గ్రీన్ ల్యాండ్ లో మిరుమిట్లు గొలిపే కొత్త చేపలు..

ఈ సృష్టిలో ఎన్నో వింత జీవాలు ఉన్నాయి.వాటిని కనుగొనేందుకు చాలా పరిశోధనలు జరుతున్నాయి.

కూడా తాజాగా ఆర్కిటిక్ మంచుకొండల్లో ఓ కొత్త జాతి చేపలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు.మంచుకొండ అయిన గ్రీన్ ల్యాండ్ సముద్ర నీటిలో ఆకుపచ్చగా మెరుస్తున్న శరీరం, చల్లటి నీటిలోనూ మనగలిగే సామర్థ్యం కారణంగా అవి పరిశోధకులను ఆకర్షించాయి.

వివిధ రకాల నత్త చేపలను కొనుగొన్న శాస్త్రవేత్తలు దీనిని ‘ఎక్స్ ట్రా - టెరెస్ట్రియల్ లుకింగ్’గా అభివర్ణించారు.వాటి రక్తంలో ఉన్న యాంటీ-ఫ్రీజ్ ప్రోటీన్ల వల్ల ఆకుపచ్చగా మెరుస్తున్నాయని చెప్పారు.

అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో రీసెర్చ్ అసోసియేట్, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ బరూచ్ కాలేజీలో జీవశాస్త్ర ప్రొఫెసర్ డేవిడ్ గ్రూబెర్ ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు.మంచు పర్వతాల మధ్య, పగుళ్లలో నివసించే కొన్ని జాతుల చేపలలో నత్త చేప ఒకటి.

Advertisement

ఇంత చిన్న చేప ఇంత అతి శీతల వాతావరణంలో గడ్డకట్టకుండా జీవించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరించింది.ఏలియన్ జీవిలా కనిపించే వాటి రక్తంలో ఉన్న యాంటీ ఫ్రీజ్ ప్రొటీన్లు వాటిని మంచు నీటిలో ప్రకాశవంతంగా, ఆకుపచ్చగా మెరిసేటట్లు చేస్తున్నాయని ప్రొఫెసర్ డేవిడ్ గ్రూబెర్ తెలిపారు.

ఈ వెలుగు వల్ల వాటి శరీరంలో వేడి పుట్టి, అవి చల్లటి నీటిలో బతకగలుగుతున్నాయని పేర్కొన్నారు.ఉత్తర, దక్షిణ ధ్రువాల నుండి వచ్చిన చేపలు స్వతంత్రంగా ఈ ప్రోటీన్లను అభివృద్ధి చేశాయని ఆయన చెప్పారు.

గ్రీన్‌ల్యాండ్ తీరంలో జరిగిన ఈ ఆవిష్కరణ సముద్ర జీవులలో పరిణామాత్మక మార్పులకు స్పష్టమైన సూచన.చేపల శరీరంపై మెరుపులు అనేవి ఆర్కిటిక్ ప్రాంతంలోని కఠినమైన పరిస్థితులలో శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి జాతులతో అభివృద్ధి చేయబడిన లక్షణంగా పరిగణించబడుతుంది.

ఈ భిన్నమైన యాంటీఫ్రీజ్ ప్రోటీన్‌లు అనేక విభిన్నమైన వాటిలో అభివృద్ధి చెంది ఉన్నాయి.

సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు