చిన్న పిల్లలకు ఏదైనా సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లను( Surprise Gifts ) తల్లిదండ్రులు ఇస్తుంటారు.అవి చూసిన వెంటనే పిల్లలు సంతోషంతో గంతులు వేస్తుంటారు.
అయితే ఆ పిల్లలు పెద్దయ్యాక తమ తల్లిదండ్రులకు ( Parents ) సర్‌ప్రైజ్ గిఫ్టులు ఇస్తే.ఇక ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు.
పిల్లలను మంచి స్థాయికి తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు.తమ ఇష్టాలను వదులుకుని పిల్లలకు కావాల్సినవి అందిస్తారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలేస్తున్నారు.అయితే కొందరు మాత్రం వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చాలా అపురూపంగా చూసుకుంటున్నారు.
ఇదే కోవలో ఇద్దరు కుమార్తెలు తమకు ఎంతో ఇష్టమైన తండ్రికి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.అది చూసిన తండ్రి కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో గురించి తెలుసుకుందాం.

తమను పెంచి పెద్ద చేసి, మంచి జీవితాన్ని ఇచ్చిన తండ్రికి ఇద్దరు కుమార్తెలు చక్కటి గిఫ్ట్ ఇచ్చారు.కొద్ది రోజుల క్రితం ఇద్దరు క్యూట్ అక్కాచెల్లెళ్లు( Sisters ) తయ తండ్రికి సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ కారును( Nissan Magnite ) బహుమతిగా ఇచ్చారు.తొలుత ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు తమ తల్లిదండ్రులను ఓ కారు షోరూమ్‌కు తీసుకెళ్తారు.
అక్కడ కనిపించే కార్లను చూస్తూ వాటి గురించి తెలుసుకుంటుంటారు.ఇంతలో ఒక ఆసక్తికర ఘటన జరుగుతుంది.
కార్ల షోరూమ్‌లోని ఒక ఉద్యోగి వారి వద్దకు వచ్చాడు.కుమార్తెల తండ్రి చేతిలో నిస్సాన్ మాగ్నెట్ కారు కీని పెట్టాడు.

అయితే ఏం జరుగుతుందో ఆ తండ్రికి ( Father ) అస్సలు అర్ధం కాలేదు.అమాయకంగా అందరి వైపు చూశాడు.అయితే ఆ కారు ఆయనకు కుమార్తెలు గిఫ్ట్‌గా ఇచ్చారని ఆలస్యంగా అర్ధమైంది.దీంతో ఆ తండ్రి కళ్లు సంతోషంలో చెమ్మగిల్లాయి.తనను చూస్తూ అందరూ చప్పట్లు కొడుతుండడంతో ఆ తండ్రి సంతోషం రెట్టింపు అయింది.ఆ తర్వాత కారుపై ఉన్న కవర్ తీసి దానిని డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.తమను అపురూపంగా పెంచి పెద్ద చేసిన తండ్రికి కుమార్తెలు ఇచ్చిన గిఫ్ట్ మర్చిపోలేనిది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.







