నటుడు నాగభూషణం మోసంతో ఘోరంగా బాధపడ్డ దాసరి..

దివంగత దాసరి నారాయణరావు.తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక సంపాదించుకున్న దర్శకుడు.

ఎన్నో సినిమాలను తెరకెక్కించడమే కాదు.పలు సినిమాల్లో నటించి మెప్పించాడు కూడా.

తన కెరీర్ లో ఎందరో నటీనటులను సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు.ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా నిలిచాడు.

తన చివరి శ్వాస వరకు సినిమా పరిశ్రమ కోసమే పాటుపడిన వ్యక్తి ఆయన.దాసరి తాతా మనువడు సినిమాతో దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు.ఈ సినిమాలో ఎస్వీ రంగారావు, రాజబాబు టైటిల్ క్యారెక్టర్లు చేశారు.

Advertisement
Dasar Felt Bad About Actor Nagabhushanam, Tata Manavadu, Dasari Narayanarao, SV

ప్రతాప్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కె రాఘవ నిర్మించాడు.ఈ సినిమాతో పాటే నిర్మాన సంస్థ కూడా పురుడుపోసుకుంది.

అయితే ఓ ప్రొడ్యూసర్ దాసరిని దర్శకుడిగా చేస్తానని మాటిచ్చి తప్పించుకున్నాడు.ఆడినమాట తప్పిన వాడిగా నిలిచాడు.

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.ఎన్టీఆర్ హీరోగా నాగ‌భూష‌ణం నిర్మాతగా తెరకెక్కిన సినిమా ఒకే కుటుంబం.

ఈ మూవీకి భీమ్ సింగ్ దర్శకుడిగా చేశాడు.ఆయన దగ్గర దాసరి అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా వర్క్ చేశాడు.

Finance And Health Minister Harish Rao Laid The Foundation Stone For The New OPD Block To Be Built

అంతే కాదు.ఈ సినిమా డైలాగ్స్ అసోషియేట్ గా కూడా పనిచేశాడు.

Advertisement

ఈ సినిమా చేస్తున్న సమయంలో దాసరి పని విధానం నాగభూషణానికి బాగా నచ్చింది.ఒక రోజు దాసరిని పిలిచి తన బ్యానర్ లో వచ్చే సినిమాకు దర్శకత్వం అవకాశం కల్పిస్తానని చెప్పాడు.

ఆయన మాట ప్రకారం ఒకే కుటుంబం సినిమా తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేశాడు దాసరి.

Dasar Felt Bad About Actor Nagabhushanam, Tata Manavadu, Dasari Narayanarao, Sv

కొంత కాలం తర్వాత నాగభూషణం ప్రజా నాయకుడు అనే సినిమా చేయాలి అనుకున్నాడు.అయితే ఇచ్చిన మాట ప్రకారం దర్శకుడిగా దాసరి నారాయణరావును కాదని వి.మధుసూదన్ రావును పెట్టుకున్నాడు.ఈ విషయం తెలియడంతో దాసరి.

నాగభూషణాన్ని నిలదీశాడు.ఏవో పిచ్చి కారణాలు చెప్పి నాగ‌భూష‌ణం ఎస్కేప్ అయ్యాడు.

ఈ ఘటనతో దారుణంగా బాధ పడ్డాడు దాసరి.ఆయన దగ్గర్నుంచి దూరంగా వెళ్లిపపోయాడు.

అనంతరం రాఘవను కలిసి తాత మనవడు కథ చెప్పాడు.తనకు నచ్చడంతో ఓకే చెప్పాడు.

ఆ తర్వాత ఈ సినిమాతో దాసరి దర్శకుడిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.

తాజా వార్తలు