గోదావరి–కావేరి అనుసంధానంపై కమ్ముకున్నా నీలినీడలు

గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనల దశలోనే ప్రశ్నార్థకంగా మారింది.ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌తో కనీసం సంప్రదింపులు జరగకుండా ఆ రాష్ట్ర కోటా 141 టీఎంసీలకు.

బచావత్‌ ట్రిబ్యునల్‌ పరిధిలోని దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు హక్కుగా కల్పించిన మిగులు జలాల్లో 106 టీఎంసీలను జతచేసి 247 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి అనుసంధానంలో తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) తొలుత ప్రతిపాదనలు రూపొందించింది.దీనిపై పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని.

ఛత్తీస్‌గఢ్‌ కోటాలోని 141 టీఎంసీలను అనుసంధానంలో తరలించేలా ప్రతిపాదనను మార్చింది.బచావత్‌ ట్రిబ్యునల్‌ తమకు కేటాయించిన నీటిని ఎలా తరలిస్తారంటూ ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో గోదావరి–కావేరి అనుసంధానంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు