టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి మనందరికి తెలిసిందే.
ప్రస్తుతం తారక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవల దేవర( Devara ) మూవీతో ప్రేక్షకులను పలకరించారు.భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ప్రస్తుతం తారక్ వార్ 2( War 2 ) తో పాటు అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తున్నారు.అయితే ఇటీవల వార్ 2 సినిమా పూర్తి అయిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి దగ్గుపాటి వెంకటేశ్వరావు( Daggubati Venkateswara Rao ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా తాజాగా ఆయన హోమ్ టూర్ నిర్వహించగా అందులో భాగంగానే ఆయన ఎన్టీఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరావు మాట్లాడుతూ.ఇండియన్ ఇండస్ట్రీకి జూనియర్ ఎన్టీఆర్ ఒక వరం, ఎన్టీఆర్ ఇంకా ఎత్తుకు ఎదుగుతాడు, రెండు మూడు పేజీల డైలాగ్స్ ని అనర్గళంగా చెప్పగలడు అంటూ ఎన్టీఆర్ చిన్నత్త పురందరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరావు జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ చేసారు.
మీ మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా ఇష్టం అని యాంకర్ అడగగా.
ఆయన కాస్త ఆలోచించి ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఇండియన్ ఇండస్ట్రీకి ఒక వరం, ఇప్పుడు అంతా పాన్ ఇండియా అయ్యింది కదా, అతనిలో ఉన్న టాలెంట్ కాదు.తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం ఏమిటి ఇప్పడు జపాన్ వెళ్లి జపనీస్ లాంగ్వేజ్ కూడా మాట్లాడేస్తున్నాడు.అతను ఇంకా చాలా ఎత్తుకు ఎదుగుతాడు, అదే నేను అనుకుంటాను.
అతనిలో ఆ లక్షణాలు ఉన్నాయి.అతనికి కూడా దేవుడి అనుగ్రహం ఉంది అని తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy