ప్రమోషన్‌ మొదలు పెట్టి వాయిదా వేయడానికి కారణం ఏంటో?

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి రానా( RANA ) తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు అభిరామ్‌( Abhiram ) సిద్ధంగా ఉన్నాడు.

తేజ దర్శకత్వంలో ఇప్పటికే అహింస అనే సినిమాను అభిరామ్ చేసిన విషయం తెల్సిందే.

ఈ నెలలో సినిమాను విడుదల చేయాల్సి ఉంది.మొదట ఏప్రిల్‌ నెలలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

ఆ తర్వాత మే నెలకు సినిమా విడుదల వాయిదా వేయడం జరిగింది.సినిమా యొక్క విడుదల తేదీ విషయంలో గందరగోళం క్రియేట్‌ అయ్యింది.

మే నెలలో సినిమా విడుదల విషయంలో క్లారిటీ లేదు.రెండు వారాల క్రితం సినిమా యొక్క ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టారు.

Advertisement

కొన్ని కార్యక్రమాల్లో అహింస యూనిట్‌ సభ్యులు సందడి చేయడం జరిగింది.అయితే సినిమా విడుదల మళ్లీ వాయిదా వేయడం చర్చనీయాంశం అయ్యింది.

సినిమా లో ఏమైనా సమస్య ఉందా లేదంటే సినిమా ఎందుకు వాయిదా వేస్తున్నారు అంటూ కొందరు ఈ సందర్భంగా మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఆకట్టుకునే కథ మరియు స్క్రీన్‌ ప్లే తో దర్శకుడు సినిమా ను రూపొందించారు అంటూ యూనిట్‌ సభ్యులు బలంగా చెబుతున్నారు.అంతే కాకుండా ఆర్పీ పట్నాయక్( RP Patnaik ) సినిమా కు మంచి సంగీతాన్ని అందించాడు అంటూ కూడా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ప్రేక్షకుల నుండి అహింస పాటలకు పెద్దగా స్పందన దక్కిన దాఖలాలు లేవు.

సినిమా ఎడిటింగ్ మరియు ఫినిషింగ్ లో లోపాలు ఉన్నాయని.వాటిని సరిదిద్దే క్రమంలో సినిమా ను వాయిదా వేశారు అంటూ ప్రచారం జరుగుతోంది.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమం ఏ సమయంలో చేయాలో తెలుసా..!

అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.అహింస ( Ahimsa )సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను మళ్లీ మొదలు పెట్టేది ఎప్పుడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

దగ్గుబాటి అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.రానా ఈ మధ్య కాలంలో సినిమా లు చేయడం లేదు.

దాంతో అహింస సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.