బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెను తుఫానుగా మారింది.దీనికి రోను అని పేరు పెట్టారు.
ఈ తుఫాను ఉత్తర దిశగా అత్యంత వేగంగా ప్రయాణిస్తోంది.తుఫాను ప్రస్తుతం మచిలీ పట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తుఫాను ప్రభావంతో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.సముద్రం అల్లకల్లోలంగా ఉంది.
ఆంధ్రాలో తీర ప్రాంత జిల్లాలలోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.తీరం వెంబడి గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు.
భద్రతా దళాలను సిద్ధంగా ఉంచారు.







