వరదల్లో కొట్టుకెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన సైబరాబాద్ పోలీసులు

ఈరోజు భారీ వర్షాల వల్ల, హిమాయత్ సాగర్ జలాశయం యొక్క 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు.తద్వారా నీటి ఉధృతి అధికంగా ఉండటంతో టీఎస్‌పీఏ నుంచి రాజేంద్ర నగర్‌కు వెళ్లే సర్వీస్‌ రోడ్డుకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

 Cyberabad Police Saved The Life Of A Person Who Was Drowning In Floods Cyberabad-TeluguStop.com

అయితే సుమారు 4:45 గంటల సమయంలో బైక్‌పై ఒక వ్యక్తి కలీజ్ ఖాన్ దర్గా నుండి శంషాబాద్ వైపు వెళ్ళుటకు హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్ వంతెనను బారికేడ్లు ఉన్నప్పటికీ వరద నీరు ప్రవహించే రోడ్డుపైకి ప్రవేశించి దాటడానికి ప్రయత్నింస్తూ వరద ఉధృతిలో కొట్టుకుపోతు ఉన్న సమయంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బేగ్ నేతృత్వంలోని రికవరీ వ్యాన్ బృందం వారు నీటిలో కొట్టుకుపోతు ఉన్న బాధితుడిని తాడు సహాయంతో రక్షించారు.తమకు అప్పగించిన విధుల పట్ల అత్యంత చిత్తశుద్ధితో మరియు శ్రద్ధతో విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ బేగ్ నేతృత్వంలోని రికవరీ వ్యాన్ బృందం యొక్క కృషిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీస్.

, అభినందిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube