లిక్కర్ స్కాం సీబీఐ కేసులో సిసోడియాకు కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కస్టడీ పొడిగింపు అయింది.

ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో ఆయనను సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హజరుపరిచారు.

ఈ క్రమంలో మే 12వ తేదీ వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.కాగా మనీశ్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

మద్యం కుంభకోణంలో ఫిబ్రవరి 26న సిసోడియాను పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం
Advertisement