కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తున్న ఏపీ.. రేపటి నుండే అమలు.. !

కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.

అయితే కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ ఆంక్షలు సడలించాయి.

ఇక ప్రస్తుతం వరకు ఏపీలో మాత్రం కరోనా ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.కాగా నేటితో కర్ఫ్యూ గడువు ముగిసిపోనుండగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

AP Govt, Curfew Relaxed, Some Districts, Tomorrow-కర్ఫ్యూ ఆం�

ఈమేరకు ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవోలో జులై 7 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు వెల్లడించింది.అలాగే కొన్ని కర్ఫ్యూ ఆంక్షలు కూడా సవరించింది.

ఈ క్రమం లో కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులను ప్రకటించింది.ఇక రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లుగా వెల్లడించింది.

Advertisement

అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు వెలుసుబాటు కల్పించగా, సాయంత్రం 6 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తుంది.కాగా కరోనా నివారణ విషయంలో ఏపీ ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకుంటుందని ఈ నియమాలను చూస్తే అర్ధం అవుతుంది.

ముక్కు దిబ్బడతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు